
Nivetha Thomos: ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది అందాల తార నివేథా థామస్. తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది అత్యంత తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీలోని పలువురు యంగ్ హీరోల సరసన ఆడిపాడిన నివేథా ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్‌తో తెలుగు ప్రేక్షకులను మరోసారి మెస్మరైజ్ చేసింది.
ఇదిలా ఉంటే కేవలంలో తాను నటనకే పరిమితం కాదని తనలో ఓ మంచి గాయని కూడా ఉందని చెప్పకనే చెప్పిందీ చిన్నది. తాజాగా ట్విట్టర్ వేదికగా నివేథా పోస్ట్ చేసిన ఓ వీడియోనే దీనికి నిదర్శనం. చేతిలో గీటర్ పట్టుకొని బాలీవుడ్ చితంలోని “కభీ కభీ అధితీ జిందగీ” అనే పాట పాడింది. ఇక నివేథా పాట పాడిన తీరు పలికించిన హావభావాలు చూస్తుంటే అచ్చంగా ప్రొఫెషనల్ సింగర్‌లానే అనిపించింది. దీంతో ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు నివేథాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నివేథా కెరీర్ విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘ఖాకిని ఢాకిని’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో రెజీనా కూడా నటిస్తుండడం విశేషం.
lekin raat ke baadh he tho savera hota hai ? pic.twitter.com/r0e7cUPqqe
— Nivetha Thomas (@i_nivethathomas) June 29, 2021