Nivetha Pethu Raj: డైరెక్షన్ చేయడం ఇష్టమంటున్న హీరోయిన్.. త్వరలోనే సినిమా చేసే ఆలోచనలో నివేతా..

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన "మెంటల్ మదిలో" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నివేత పేతురాజ్. ఆ మూవీ తర్వాత "చిత్రలహరి", "బ్రోచేవారెవరురా" వంటి

Nivetha Pethu Raj: డైరెక్షన్ చేయడం ఇష్టమంటున్న హీరోయిన్.. త్వరలోనే సినిమా చేసే ఆలోచనలో నివేతా..
Nivetha Pethuraj

Edited By:

Updated on: Jul 19, 2021 | 1:48 PM

యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన “మెంటల్ మదిలో” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నివేత పేతురాజ్. ఆ మూవీ తర్వాత “చిత్రలహరి”, “బ్రోచేవారెవరురా” వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన “అల వైకుంఠపురం” సినిమాతో హిట్ అందుకుంది నివేత. ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని నటించిన “రెడ్” సినిమాలో కీలక పాత్రలో నటించింది నివేతా. ప్రస్తుతం ఈ అమ్మడు.. రానా, సాయి పల్లవి జంటగా నటిస్తున్న “విరాట పర్వం” సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజాగా ఉంది నివేతా. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మెగాఫోన్ పట్టాలనుకుంటుందట.

తనకు డైరెక్షన్ చేయడమంటే చాలా ఇష్టమంటుంది నివేత పేతురాజ్. స్టార్ హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని బావిస్తుందట నివేతా. కొంతకాలం వరకు సినిమాలు చేసి ఆ తర్వాత ఒక కథను సిద్ధం చేసుకుని డైరెక్షన్ చేయాలని భావిస్తున్నట్లుగా సన్నిహితుల దగ్గరు చెబుతోందట. సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా కెరీర్ ఆరంభించి.. మెగాఫోన్ పట్టి సక్సెస్ అయినవారు చాలా మందే ఉన్నారు. మరి నివేతా పేతురాజ్ కూడా అదే జాబితాలో చేరుతుందా ? లేదా ? అనేది చూడాలి. ప్రస్తుతం నివేత తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ వరసు అవకాశాలను అందుకుంటుంది. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ “పార్టీ” లోనూ ఎ, ఎల్.విజయ్ ఫిమేల్ సెంట్రిక్ మూవీ “అక్టోబర్ 31 లేడీస్ నైట్” లోనూ నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తోంది. ఇక తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్న పాగల్ చిత్రంలోనూ నివేతా నటిస్తోంది.

Also Read: Rajendra Prasad: ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే హీరో.. నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ బర్త్ స్పెషల్..

Mahesh Babu: క్రేజీ ప్రాజెక్టుకు అంతా సిద్ధం.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మహేష్‌ బాబు సినిమా.. దర్శకుడు ఎవరంటే.?