
టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ అదృష్టం మాత్రం అంతగా కలిసిరాలేదు. తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. విశ్వక్ సేన్ నటించిన పాగల్, ధమ్కీ సినిమాలతో నివేదాకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే కొన్నాళ్లుగా నివేదా సినిమాలను అనౌన్స్ చేయడం లేదు. అలాగే బయట ఎక్కడా కనిపించడం లేదు. కానీ తాజాగా నివేదాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
సినీనటి నివేథ పేతురాజ్ తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలి అని అన్నారు. అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు నివేదా నిరాకరించింది. అది తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ అయ్యారు నివేదా. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.
వీడియో చూడండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.