Niti Taylor: విడాకులు తీసుకోనున్న ‘మేం వయసుకు వచ్చాం’ హీరోయిన్! ఇన్‌స్టాలో భర్త పేరు, ఫొటోలు డిలీట్

ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సైంధవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హార్దిక్ పాండ్యా, - నటాషా లు కూడా ఇదే బాటలో నడవనున్నారని ప్రచారం సాగుతోంది. ఇక బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ వీర్ సింగ్- దీపిక పదుకొణెలపై కూడా విడాకుల రూమర్లు వస్తున్నాయి. తాజాగా ఈ విడాకుల జాబితాలో మరో టాలీవుడ్ హీరోయిన్ చేరనుందని సమాచారం

Niti Taylor: విడాకులు తీసుకోనున్న మేం వయసుకు వచ్చాం హీరోయిన్! ఇన్‌స్టాలో భర్త పేరు, ఫొటోలు డిలీట్
Niti Taylor

Updated on: Jun 01, 2024 | 5:18 PM

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన విడాకుల పర్వం ఎక్కువైంది. ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సైంధవి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. హార్దిక్ పాండ్యా, – నటాషా లు కూడా ఇదే బాటలో నడవనున్నారని ప్రచారం సాగుతోంది. ఇక బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ వీర్ సింగ్- దీపిక పదుకొణెలపై కూడా విడాకుల రూమర్లు వస్తున్నాయి. తాజాగా ఈ విడాకుల జాబితాలో మరో టాలీవుడ్ హీరోయిన్ చేరనుందని సమాచారం. ఆ బ్యూటీ మరెవరో కాదు మేం వయసుకు వచ్చాం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నీతి టేలర్. ఇందులో ‘దిల్’ అనే ముస్లిమ్ అమ్మాయిగా కుర్రాళ్ల మనసులను దోచేసిందీ అందాల తార. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడి బుల్లితెరపై బిజీబిజీగా మారిపోయింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఆర్మీ అధికారి పరీక్షిత్ బవా ను ప్రేమించి పెళ్లిచేసుకుంది నీతి టేలర్. కరోనా కాలంలో అంటే 2020లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది.

 

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నీతి టేలర్ ఇటీవల తన అభిమానులకు షాక్ ఇచ్చింది. సడన్ గా ఇన్స్టా గ్రామ్‌ లో తన పేరు పక్క నుంచి భర్త ఇంటి పేరుని తొలగించింది. అంతేకాదు.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా తొలగించింది. దీంతో ఆమె ఫాలోవర్లు షాక్ తిన్నారు. నీతి టేలర్ విడాకులు తీసుకోనుందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత? అబద్ధమెంత? అన్నది తెలియాలంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

ఢిల్లీకి చెందిన నితీ టేలర్.. 15 ఏళ్ల వయసులోనే నటిగా మారింది. ‘ప్యార్ కా బందన్’ అనే సీరియల్‌లో మొదట నటించింది. న ‘కైసీ హే యారియన్’ అనే సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. అప్పటినుంచి ఓవైపు టీవీ ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు  సినిమాలు కూడా చేసింది.  అయితే పెళ్లయ్యాక సినిమాలకు దూరమైంది.

నీతి టేలర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.