Gangs Of Godavari Review: హిట్టా.? ఫట్టా.? మాస్ ఎంటర్టైన్ గా విశ్వక్ సేన్ గెలిచాడా.?

డిఫెరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. ధమ్కీ, గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. ఊరిలో పనీ పాటా లేకుండా తిరిగే ఒక కుర్రాడు లంకల రత్న అలియాస్ విశ్వక్ సేన్. ఆ ఊళ్లో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు.

Gangs Of Godavari Review: హిట్టా.? ఫట్టా.? మాస్ ఎంటర్టైన్ గా విశ్వక్ సేన్ గెలిచాడా.?

|

Updated on: Jun 01, 2024 | 5:17 PM

డిఫెరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్ సేన్. ధమ్కీ, గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

ఊరిలో పనీ పాటా లేకుండా తిరిగే ఒక కుర్రాడు లంకల రత్న అలియాస్ విశ్వక్ సేన్. ఆ ఊళ్లో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలను చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. తను కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్లకు ఎదురు తిరుగుతాడు. వాళ్లకు ధీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదుగుతాడు. రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చి తనే మారిపోతాడు. మరోవైపు లంకల రత్న జీవితంలో బుజ్జి అలియాస్ నేహా శెట్టి ఉంటుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మరోవైపు రత్నమాల అలియాస్ అంజలితోనూ రిలేషన్‌లో ఉంటాడు. ఈ క్రమంలోనే లంకల రత్న జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది పూర్తి కథ..

రౌడీ ఫెల్లో, చల్ మోహన్ రంగ సినిమాల్లో ఎక్కువగా కామెడీ ఉంటుంది. రౌడీ ఫెల్లోలో యాక్షన్ ఉన్నా కూడా.. లోపల కామెడీ ట్రాక్‌తోనే సినిమాను నడిపించాడు దర్శకుడు కృష్ణ చైతన్య. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అలా కాదు.. ఇది చాలా డిఫెరెంట్ సినిమా. ఇలాంటి కథను మాస్ యాంగిల్‌లో చెప్పాలనుకోవడం కూడా సాహసమే. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా విశ్వక్ సేన్ లాంటి హీరోను తీసుకున్నపుడే ఈ సినిమాకు సగం న్యాయం జరిగింది. లంకల రత్న పాత్రలో విశ్వక్ ఒదిగిపోయాడు. సినిమా మొదలైన కాసేపటికే ఆ కారెక్టర్‌తో ప్రేమలో పడిపోతాం.. దాంతోనే ట్రావెల్ అయిపోతాం. కథలో ఏం జరుగుతుంది.. కథనం ఏంటి.. స్లోగా ఉందా ఇలాంటి ఆలోచనలు రాకుండా పూర్తిగా హీరో పాత్రతోనే కథను ముందుకు తీసుకెళ్లాడు కృష్ణ చైతన్య.

ఫస్ట్ హాఫ్‌లో హీరో కారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త టైమ్ తీసుకున్నాడు దర్శకుడు.. కానీ ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందే వచ్చే ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కనీసం బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా లేకుండా వచ్చే ఆ ఫైట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలాగే ట్రక్ ఫైట్ కూడా అదిరిపోయింది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త స్లోగా ఉంటుంది కానీ ఎమోషన్స్ బాగున్నాయి. రాజకీయాల్లో ఉండే లొసుగులు వాడుకుంటూ హీరో ఎలా పైకి ఎదిగాడు.. ఆ తర్వాత ఎలా దిగజారాడు అనేది కూడా పక్కాగా చూపించాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా వరకు తెలిసిన కథలాగే అనిపిస్తుంది కానీ ఎంగేజింగ్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా కారెక్టర్ డ్రివెన్‌గానే సినిమా వెళ్లిపోతుంది. సినిమాగా కంటే కూడా సీన్స్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం అద్బుతంగా ఉంటుంది. అంజలి, విశ్వక్ సేన్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి.. అలాగే గోకరాజు రమణ సీన్స్ కూడా చాలా బాగున్నాయి.

విశ్వక్ సేన్ లంకల రత్న పాత్రకు ప్రాణం పోసాడు. ఆ కారెక్టర్ కోసమే పుట్టాడేమో అనేంతగా ఒదిగిపోయాడు. యాస కూడా చాలా బాగా మాట్లాడాడు. నేహా శెట్టి కారెక్టర్ బాగుంది. బుజ్జి పాత్రలో చాలా బాగా నటించింది. అంజలి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విశ్వక్ సేన్‌ను సపోర్ట్ చేసే పాత్రలో అద్భుతంగా నటించింది. నాజర్, హైపర్ ఆది, గోకరాజు రమణ లాంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేసారు. సినిమాకు యువన్ శంకర్ రాజా ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. ఆర్ఆర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. దర్శకుడు కృష్ణ చైతన్య రైటింగ్ పవర్ బాగుంది. అతడిలోని దర్శకుడిని రైటర్ డామినేట్ చేసాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఇక ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. మాస్ ఆడియన్స్‌కు పండగే పండగ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
లవ్లీ హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..