TOP9 ET: రేస్‌ ట్రాక్‌పై రచ్చ లేపిన యువ సామ్రాట్| దారుణ అవమానం! ఆ హీరో మన డైరెక్టర్‌ను తప్పుబట్టాడా?

టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ హీరో చేతిలో అవమానం జరిగిందా? అంటే అవుననే పోస్టులు కనిపిస్తున్నాయి నెట్టింట. రీసెంట్‌గా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ డేట్స్‌ ఇచ్చారని.. తన జై హనుమాన్ సినిమాను కూడా పక్కకు పెట్టి.. ఆ హీరోతో రావణ్ సినిమాను మొదలెట్టారు ప్రశాంత్ వర్మ. కానీ ప్రశాంత్ ప్రియారిటీని.. ఏమాత్రం పట్టించుకోని రణ్‌వీర్ ఆ సినిమా నుంచి ఉన్నట్టుండి తప్పుకున్నారు. మేకర్స్‌ క్రియేటివ్ డిఫరెన్సెన్స్‌ అని అఫీషియల్ వివరణ కూడా రీసెంట్‌గా ఇచ్చారు. కానీ రణ్‌వీర్‌ టీంను డైరెక్టర్ అండ్ మేకర్స్ పట్టించుకోవడం లేదనే కారణంతోనే..

TOP9 ET: రేస్‌ ట్రాక్‌పై రచ్చ లేపిన యువ సామ్రాట్| దారుణ అవమానం! ఆ హీరో మన డైరెక్టర్‌ను తప్పుబట్టాడా?

|

Updated on: Jun 01, 2024 | 5:23 PM

01.naga chai: రేస్‌ ట్రాక్‌పై రచ్చ లేపిన యువ సామ్రాట్.

చూడ్డానికి కాస్త క్లాసీగా.. సైలెంట్‌గా ఉండే యువసామ్రాట్ నాగచైతన్య.. ఓ స్పోర్ట్స్‌ కార్‌ దొరికితే చాలు.. వైల్డ్‌గా.. వేగంగా.. దూసుకుపోతాడు. ఇదిగో ఈ వీడియోలో అదే చేశాడు. స్పోర్ట్స్‌ కార్స్‌ అంటే.. చచ్చేంత ఇష్టపడే నాగచైతన్య.. రీసెంట్‌గా ఓ స్పోర్ట్స్‌ కార్‌ను రేస్‌ ట్రాక్‌ పై రైడ్ చేశాడు. మాగ్జిమమ్‌ స్పీడ్‌లో ట్రాక్ పై రచ్చ చేశాడు. ఆ వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ కూడా అవుతున్నాడు.

02.prashanth: దారుణ అవమానం..! ఆ హీరో మన డైరెక్టర్‌ను తప్పుబట్టాడా?

టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలీవుడ్ హీరో చేతిలో అవమానం జరిగిందా? అంటే అవుననే పోస్టులు కనిపిస్తున్నాయి నెట్టింట. రీసెంట్‌గా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ డేట్స్‌ ఇచ్చారని.. తన జై హనుమాన్ సినిమాను కూడా పక్కకు పెట్టి.. ఆ హీరోతో రావణ్ సినిమాను మొదలెట్టారు ప్రశాంత్ వర్మ. కానీ ప్రశాంత్ ప్రియారిటీని.. ఏమాత్రం పట్టించుకోని రణ్‌వీర్ ఆ సినిమా నుంచి ఉన్నట్టుండి తప్పుకున్నారు. మేకర్స్‌ క్రియేటివ్ డిఫరెన్సెన్స్‌ అని అఫీషియల్ వివరణ కూడా రీసెంట్‌గా ఇచ్చారు. కానీ రణ్‌వీర్‌ టీంను డైరెక్టర్ అండ్ మేకర్స్ పట్టించుకోవడం లేదనే కారణంతోనే.. కోపం పెంచుకున్న రణ్‌వీర్ … ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే న్యూస్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇదే నెట్టింట వైరల్ అవడంతో.. టాలీవుడ్ డైరెక్టర్‌కు అవమానం అనే కామెంట్ మన నెటిజన్స్ నుంచి వస్తోంది.

03.keerthi: పుష్పకు పోటీ దిగుతున్న కీర్తి సురేష్‌

పుష్ప అంటే ఫైరు.. జనాల్లో ఈ సినిమా సీక్వెల్‌ పై విపరీతంగా ఉంది క్రేజు! ఇక ఆ ఫైర్‌ను..! పుష్ప2 పై ఇప్పుడున్న క్రేజ్‌ను పట్టించుకోకుండా… ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఆగస్ట్‌ 15నే తన సినిమాతో థియేటర్లలోకి వస్తోంది కీర్తి. బన్నీకి పోటీకి తాను లీడ్‌ రోల్ చేసిన రఘు తాత సినిమాను తీసుకొస్తోంది. మరి పుష్ప రాజ్ ధాటికి కీర్తీస్ రఘు తాత సినిమా నిలుస్తుందా..? లేక పత్తా లేకుండా పోతుందా చూడాలి!

04.anjali: బాలయ్యను ట్రోల్ చేస్తున్న వారికి ఇన్‌డైరెక్ట్‌గా ఇచ్చిపడేసిన అంజలి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో.. అంజలిని బాలయ్య నెట్టడంపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అంజలిని సపోర్ట్‌ చేస్తూ.. బాలయ్యను విమర్శిస్తూ కొందరు కావాలనే పోస్టులు పెడుతున్నారు. అయితే ఇలా చేస్తున్న వారికి ఇండైరెక్ట్‌గా.. స్మూత్‌గా ఇచ్చిపడేసింది హీరోయిన్ అంజలి. GOG ఈవెంట్‌కు బాలయ్య చీఫ్‌ గెస్ట్‌ గా విచ్చేసినందుకు బాలయ్యకు స్పెషల్ థాంక్స్ చెప్పింది. మా ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి గౌరవం ఉందని.. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌ అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు బాలయ్యతో వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని తన ట్వీట్‌లో కోట్ చేసింది.

05. mahesh: నాన్నను మర్చిపోలేకపోతున్న మహేష్‌.

తనను ఈ లోకంలోకి తీసుకొచ్చిన నాన్నను విపరీతంగా ప్రేమించడమే కాదు.. దేవుని కంటే ఎక్కువగా పూజిస్తుంటారు.. ఆరాధిస్తుంటారు మహేష్‌ బాబు. తను తిరుగులేని లోకానికి వెళ్లి దాదాపు మూడేళ్లు అవుతున్నా.. ఆయన్ను మరిచిపోకుండా.. ఏదో సందర్భంలో గుర్తు చేసుకుని ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇక మే31న తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌ డే కావడంతో మరో సారి తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈయన. “హ్యాపీ బర్త్ డే నాన్న… మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతున్నాము. నా ప్రతి జ్ఞాపకంలో మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు.” అంటూ మహేష్ తన ట్వీట్‌లో ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

06.balayya: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మన బాలయ్యను అంత మాటన్నాడేంటి.!

హీరోయిన్ అంజలి.. బాలయ్యతో ఇంతకు ముందే ఓ సినిమా చేశారు. వీరిద్దరికీ మంచి ర్యాపో.. ఫ్రెండ్‌షిప్‌ కూడా ఉంది. ఇక ఆ ర్యాపోతోనే GOG ఈవెంట్లో సరదాగా.. అంజలిని తోసేసాడు బాలయ్య. అయితే ఈ వీడియో క్లిప్‌ కాస్తా ఇప్పుడు వివాదంగా మారింది. బార్డర్ దాటి మరీ నార్త్‌ ఇండస్ట్రీలోనూ వైరల్ అవుతోంది. అక్కడ కూడా బాలయ్యపై విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఇక ఈక్రమంలోనే బాలీవుడ్ ట్యాలెంట్ డైరెక్టర్ హన్సల్ మెహతా.. ఈ వీడియోపై ట్వీట్ చేశారు. బాలయ్యను దారుణ మాట అనేశాడు.

07.bigg boss 8: బయటికి వచ్చిన బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్

పక్కింటి పంచాయితీ.. ఎవ్వరికైనా ఎంటర్‌టైనింగ్ గానే ఉంటుంది అనే లైన్‌ ను బేస్‌ చేసుకుని పుట్టిన బిగ్ బాస్.. తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయింది. ఏడు సీజన్స్‌ కంప్లీట్ చేసుకుని త్వరలో 8వ సీజన్‌ మొదలుకానుంది. ఇక ఈ క్రమంలోనే రాబోయే 8వ సీజన్లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా ఉండబోతున్నారనే లిస్టు ఒకొటి వచ్చింది. ఇక ఆ లిస్టు ప్రకారం.. ఈసారి యాంకర్స్‌ కేటగిరీ నుంచి అంజలి పవన్, వింధ్య విశాక, నయని పావని.. నిఖిల్..! . ఇక యూట్యూబర్స్‌ నుంచి జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్..ఉన్నారట! వీళ్లే కాకుండా ఇటీవల నెట్టింట వైరల్ అయిన కుమారీ ఆంటీ.. బర్రెలక్క.. అనీల్ గీలా.. పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. వీరితో పాటు బుల్లెట్ భాస్కర్.. యాక్టర్ సోనియా సింగ్.. యూట్యూబర్.. బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత.. పేర్లు కూడా బిగ్ బాస్ 8కి వెళ్లే వాళ్లలో లిస్టులో వినిపిస్తున్నాయి.

08.brek up: ఆమెకు 50 ఏళ్లు .. మనోడికి 38 ఏళ్లు.. ఎట్టకేలకు బ్రేకప్‌..

ప్రేమ తీరే అంతా..! ఎవరి మధ్య ఎప్పుడు పుడుతుందో…ఎందుకు పుడుతుందో.. ఎలా పుడుతుందో.. తెలియకుండానే పుట్టేస్తుంది. ఒకరికొకరు ఏకం అయ్యే వరకు… విరహ దాహం తీరే వరకు నిలవనీయకుండా చేస్తుంది. అప్పుట్లో ఇదే జరిగింది బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, మలైకా ఆరోరా విషయంలో..! అందుకే తన కంటే వయసులో పెద్ద, ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించాడుఅర్జున్ కపూర్. ఇన్నాళ్లూ ప్రేమింగ్.. డేటింగ్ గట్టిగానే చేశారు. ఇక ఇప్పుడు ఏం అనుకున్నారో.. తెలీదు కానీ.. ఎవరికి వారు వేరు వేరుగా వుంటున్నారట. ఎట్టకేలకు బ్రేకప్ చేసుకున్నాట. 50 ఏళ్ల మలైకా.. 38 ఏళ్ల అర్జున్ కపూర్ ఇప్పుడు విడిపోయారట.

09.buchi babu: బుచ్చిబాబు ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్‌ దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి పెదకాపు ఇవ్వాళ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుచ్చిబాబు తండ్రి, వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం యు.కొత్తపల్లిలో జరిగాయి. దర్శకుడు సుకుమార్‌ అంత్యక్రియల్లో పాల్గొని బుచ్చిబాబును ఓదార్చారు. పెదకాపు మరణంతో బుచ్చిబాబు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles