Bhaje Vayu Vegam Review: హిట్టా.? ఫట్టా.? ఈ సారి అయినా కార్తికేయ హిట్ అందుకున్నాడా.?
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఆ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో భజే వాయువేగం సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు కార్తికేయ. మరి ఈ సినిమా కార్తికేయకు ఓ బిగ్ అండ్ సాలిడ్‌ను ఇచ్చేలాగే ఉందా? అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ..!
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఆ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో భజే వాయువేగం సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు కార్తికేయ. మరి ఈ సినిమా కార్తికేయకు ఓ బిగ్ అండ్ సాలిడ్‌ను ఇచ్చేలాగే ఉందా? అనేది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ రివ్యూ.!
భజే వాయు వేగం కథలోకి వెళితే.. వెంకట్ అలియాస్ కార్తికేయ చిన్నప్పుడే తల్లిదండ్రులు అప్పుల బాధతో చనిపోతారు. అనాథగా మారిన ఇతడిని, తండ్రి స్నేహితుడు తనికెళ్లి భరణి దత్తత తీసుకుంటాడు. తన సొంత కొడుకు వెంకట్ అలియాస్ రాహుల్ టైసన్‌లానే వెంకట్‌ని కూడా పెంచి పెద్ద చేస్తాడు. సిటీలో అద్దె ఇంట్లో ఉండే అన్నదమ్ములిద్దరూ.. ఉద్యోగాలు చేస్తున్నామని చెప్పి తండ్రిని మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో డబ్బుల కోసం వెంకట్ బెట్టింగ్ వేస్తాడు. అందులో గెలుస్తాడు. కానీ విలన్ గ్యాంగ్ ఇతడిని మోసం చేస్తారు. దీంతో ఊహించని పరిస్థితుల్లో వాళ్లపై పగ తీర్చుకోవాల్సి వస్తుంది. మరి చివరకు ఏమైంది? వెంకట్ తాను అనుకున్నది సాధించాడా? లేదా? ఇతడితో డేవిడ్ అలియాస్ రవి శంకర్, జార్జ్ అలియాస్ శరత్ లోహిత్స్వకి సంబంధమేంటి? అనేదే మెయిన్ స్టోరీ.
‘భజే వాయు వేగం’ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే బెట్టింగ్స్‌లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. ఊహించని విధంగా కెరీర్, వ్యక్తిగత, రాజకీయ పరంగా సమస్యల్లో ఇరుక్కుని ఎలా గెలిచి నిలబడ్డాడు అనేదే కథ. ఓవరాల్‌గా చూస్తే డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. కథ పరంగా చూస్తే కొన్ని సీన్స్ ఊహించేలా ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే బాగుంది. పెద్దగా ల్యాగ్ చేయకుండా వచ్చిన సీన్స్ టైటిల్‌కి తగ్గ న్యాయం చేశాయి.
ఇక కార్తికేయ తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో అందర్నీమెస్మరైజ్ చేశాడు. బాధ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ బాగా పలికించాడు. ఇక హీరోయిన్ పర్వాలేదనిపించింది. ఇక హీరోతో పాటు సరిసమానంగా ఉండే అన్న పాత్ర చేసిన రాహుల్ టైనస్.. తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో సూపర్భ్ గా పర్ఫాన్స్ చేశాడు. విలన్‌గా చేసిన రవిశంకర్ అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి తన పరిధి మేర నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి అదరగొట్టేశాడు. తొలి మూవీనే కమర్షియల్‌గా తీస్తున్నప్పటికీ అనవసర సీన్స్ జోలికి పోకుండా డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ డెలివరీ చేశాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ‘భజే వాయువేగం’.. మిమ్మల్ని పక్కాగా థ్రిల్ చేసే మూవీ!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

