ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు సేవ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరోవైపు సమయం దొరికినప్పుడు తన ప్రాజెక్ట్స్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ చేతిలో నాలుగైదు చిత్రాల వరకు ఉన్నాయి. అందులో ఓజీ ఒకటి. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో సినిమా డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ రాజకీయంగా పవన్ బిజీగా ఉండడంతో సినిమాలకు డేట్లు కేటాయించలేకపోతున్నాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసేందుకు డేట్స్ ఇచ్చాడట పవన్. అలాగే త్వరలోనే ఓజీ మూవీకి సైతం డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రాబోతున్న ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ మూవీ చివరి షెడ్యూల్ థాయ్ లాండ్ లో చిత్రీకరించాల్సి ఉందని టాక్. అయితే ఈ షెడ్యూల్ ఎప్పుడూ స్టార్ట్ చేయనున్నారనేది తెలియరాలేదు. ఇక ఓజీ చిత్రంలో పవర్ ఫుల్ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ పాటలో డీజే టిల్లు ఫేమ్ రాధిక అలియాస్ నేహా శెట్టి కనిపిస్తుందని టాక్. ఇందులో పవర్ స్టార్ తో కలిసి నేహా శెట్టి స్టెప్పులేయనుంది. అయితే వీరిద్దరి కాంబోలోనే ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందా అనేది తెలియరాలేదు. ఇప్పుడు ఓజీ స్పెషల్ సాంగ్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
రాధికతో పవర్ స్టార్ స్పెషల్ సాంగ్..ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఓజీ చిత్రంలో పవన్ స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.