Nayanthara: ఎర్ర చీరలో ముద్దమందారంలా మెరిసిన నయన్.. ఏం అందం గురూ..!
న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన నయన్.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాతో నయన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న భామలు కొద్దిమందే ఉన్నారు. వారిలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన నయన్.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాతో నయన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది.
తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. తెలుగులో దాదాపు అందరు హీరోల సరసన నటించింది నయన్. ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే అక్కడ షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఇక నయన్ సినిమాలకోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. సినిమాలతో పాటు పలు యాడ్స్ లోనూ నటించింది. మొన్నామధ్య ‘టాటా స్కై’ యాడ్ లోనూ కనిపించి ఆకట్టుకుంది. అయితే 50 సెకన్ల యాడ్ కోసం నయనతార రూ.5 కోట్లు వసూలు చేసిందట ఈ ముద్దుగుమ్మ. నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
నటి నయనతారను ఆమె అభిమానులు “లేడీ సూపర్ స్టార్” అని పిలుస్తారు. ప్రస్తుతం నయనతార 75వ చిత్రం అన్నపూరణి మొన్నీమధ్య విడుదలైంది. విమర్శకుల ప్రశంసల తర్వాత ఈ చిత్రం గత డిసెంబర్‌లో విడుదలైంది. తాజాగా నటి నయనతార ఫోటో షూట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్‌లో నిరంతరం యాక్టివ్‌గా ఉండే నయన్ తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఇవి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది మరియు వేలాది లైక్‌లను సంపాదించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.