Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) వాడకం ఏ రేంజ్‏లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులే కాకుండా.. సెలబ్రెటీలు సైతం నెట్టింట్లో తెగ గడిపేస్తుంటారు.

Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..
Nandita

Updated on: Feb 07, 2022 | 7:41 PM

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) వాడకం ఏ రేంజ్‏లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. సామాన్యులే కాకుండా.. సెలబ్రెటీలు సైతం నెట్టింట్లో తెగ గడిపేస్తుంటారు. తమ లేటేస్ట్ ఫోటోస్.. అరుదైన జ్ఞాపకాలు.. మూవీ అప్డేట్స్.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇలా ఫోటోస్.. వీడియోస్ షేర్ చేసిన కొన్ని సందర్భాల్లో నెటిజన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోంటారు. పలు సందర్భాల్లో హీరోయిన్స్ షేర్ చేసే ఫోటోస్ పై నెటిజన్స్ అసభ్యకరంగా కామెంట్స్ చేస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఈ ట్రోలింగ్ బారిన పడినవారే. అందులో కొందరు ఈ నెగిటివ్ కామెంట్స్ పై స్పంధిస్తూ.. స్ట్రాంగ్ ఆన్సర్ ఇస్తుంటారు. మరికొందరు కామెంట్స్ అస్సలు పట్టించుకోకుండా తమ పని తాము చూసుకుంటారు. ఇప్పటికే రష్మిక మందన్న.. పూజా హెగ్డే.. రకుల్ ఇలా ఒక్కరేమిటీ దాదాపు అందరూ ట్రోలింగ్ సమస్య బారిన పడిన వారే. తాజాగా హీరోయిన్ నందితా శ్వేతకు (Nanditha Swetha) కూడా నెటిజన్స్ నుంచి ఊహించని కామెంట్ వచ్చింది.

నందితా శ్వేత..వెండితెరపై అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా.. నందితా శ్వేత నటన పరంగానూ సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే అన్ని చిత్రాలు కలిసోచ్చినా కానీ.. నందితా శ్వేతకు మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై ఓ ప్రముఖ డ్యాన్స్ షోకు జడ్జీగా వ్యవహరిస్తూ అలరిస్తుంది. తాజాగా నందితా శ్వేత తన ఇన్‏స్టాలో లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేసింది. అయితే ఈ ఫోటలకు ఓ నెటిజన్ అసభ్యకరంగా కామెంట్ చేశాడు.

Nanditha Swetha

నీ శరీరాకృతిని చూసుకో.. నీ షేప్స్ కూడా చూసుకో.. కాస్త వర్కవుట్స్ చేయ్ అంటూ అసభ్యంగా కామెంట్స్ చేశాడు. దీంతో నందితా సదరు నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు. నేను దేవతను కాదు.. నేను కూడా మాములు మనిషినే. అందరిలాగే నాకు కూడా బాధలుంటాయి. ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు. నా శరీరాన్ని నేను ప్రేమిస్తాను.. ప్రస్తుతం నేను ఎలా ఉన్నా.. దాన్ని నేను ఇష్టపడుతున్నాను అంటూ స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది.

Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

Lata Mangeshkar: అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రేమ వాళ్లది.. లతా మంగేష్కర్ ప్రేమ ద్వేషంగా ఎందుకు మారిందో తెలుసా..

Pawan Kalyan-Statue of Equality: సమతామూర్తి భగవద్ రామానుజాచార్య సన్నిధిలో ‘పవన్ కళ్యాణ్’.. చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్న ‘జనసేనని’ ఫొటోస్..

Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)