Actress Meena: రెండో పెళ్లిపై విలేకరి తిక్క ప్రశ్నలు.. సూటిగా ఆన్సర్ ఇచ్చిన మీనా..

భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. త్వరలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని.. అది కూడా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో అంటూ నెట్టింట ప్రచారం నడిచింది. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన రూమర్స్ పై అనేకసార్లు క్లారిటీ ఇచ్చింది మీనా. కానీ ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలో సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదుర్కొంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాను రెండు వివాహం గురించి పదే పదే అడుగుతూ విసుగు తెప్పించాడు ఓ విలేకరి.

Actress Meena: రెండో పెళ్లిపై విలేకరి తిక్క ప్రశ్నలు.. సూటిగా ఆన్సర్ ఇచ్చిన మీనా..
Actress Meena
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2024 | 11:11 AM

బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగారు హీరోయిన్ మీనా. సౌత్ ఇండస్ట్రీలో దాదాపు అందరూ స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కథానాయికగా స్టార్ డమ్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు మీనా. సెకండ్ ఇన్నింగ్స్‏లో సహయ నటిగా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోని సంఘటన జీవితాన్ని కుదిపేసింది. అనారోగ్య సమస్యలతో ఆమె భర్త ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. భర్త మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె గురించి సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. త్వరలోనే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుందని.. అది కూడా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో అంటూ నెట్టింట ప్రచారం నడిచింది. అయితే తన పర్సనల్ లైఫ్ గురించి వచ్చిన రూమర్స్ పై అనేకసార్లు క్లారిటీ ఇచ్చింది మీనా. కానీ ఇప్పటికీ పలు ఇంటర్వ్యూలో సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదుర్కొంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాను రెండు వివాహం గురించి పదే పదే అడుగుతూ విసుగు తెప్పించాడు ఓ విలేకరి. ఈ క్రమంలో అతడికి సూటిగా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది మీనా.

అందంగా ఉన్నారు.. వయసు కూడా తక్కువే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా ?.. అని పదే పదే అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగాడు ఓ జర్నలిస్ట్. దీంతో మీనా సూటిగా.. సుత్తిలేకుండా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది. “మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇప్పుడైతే లేదు. ఎవర్నీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా ? అంటే అలా చాలా మంది ఉంటున్నారు కదా. అలాగే నేను వాళ్లలాగే ఉంటానని కాదు.. ఎవరి పరిస్థితి వాళ్లది. నా జీవితం గురించి నేనెప్పుడు ముందే అనుకోలేదు. తక్కువ వయసు, ఎక్కువ వయసు అని కాదు.. నా భవిష్యతు గురించి నేను ఊహించలేను. నేను కాదు ఎవరూ ఊహించలేరు. ముందు నా జీవితం గురించి కాకుండా కూతురి గురించి ఆలోచిస్తున్నాను.

సినిమాల్లోకి వస్తానని.. ఇంత పెద్ద హీరోయిన్ అవుతానని అనుకోలేదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో నటిస్తానని ఊహించలేదు. జీవితం ఇలాగే ఉంటుందని కూడా అనుకోను. పెళ్లి కూడా అంతే.. అప్పుడు.. ఇప్పుడు అని చెప్పలేను. అలాగని ఒంటరిగా ఉండిపోతానని చెప్పలేను. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది నా కూతురి గురించి మాత్రమే. నాకంటే నా కూతురు నాకు ముఖ్యం. నా సుఖం, నా సంతోషం మాత్రమే కాదు.. నా ఫస్ట్ ప్రియారిటీ నా కూతురు. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వెయిట్ చేయడమే. పెళ్లి గురించి ఏమి ఊహించి చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చింది మీనా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.