Tollywood: స్టార్ హీరోయిన్ కూతురు.. అందంలో అమ్మను మించిపోయింది.. ఇక డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

44 ఏళ్ల వయసులోనూ అందంతో మాయ చేస్తుంది. ఇక బైక్ రైడ్స్ అంటూ నిత్యం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. ఇటీవలే రూ.28 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ మీద రైడ్ చేసి నెట్టింట ఫేమస్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

Tollywood: స్టార్ హీరోయిన్ కూతురు.. అందంలో అమ్మను మించిపోయింది.. ఇక డ్యాన్స్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..
Actress Daughter

Updated on: Jun 23, 2023 | 7:02 PM

మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాతో మంజు క్రేజ్ మారిపోయింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ చెల్లెలి పాత్రలో ఇచ్చిపడేసింది మంజు. ఇక ఇటీవల తమిళంలో అజిత్ సరసన తునీవు చిత్రంలో నటించి మెప్పించింది. కేవలం సినిమాలతోనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ మంజు చాలా స్పెషల్. 44 ఏళ్ల వయసులోనూ అందంతో మాయ చేస్తుంది. ఇక బైక్ రైడ్స్ అంటూ నిత్యం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంటుంది. ఇటీవలే రూ.28 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ మీద రైడ్ చేసి నెట్టింట ఫేమస్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మంజు వారియర్ కూతురు మీనాక్షి గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది. అందంలో అమ్మను మించిపోయిన మీనాక్షి.. నాట్యంతో మైమరపించింది. మయూరాన్ని తలపించింది మీనాక్షి. ఆమె నాట్యం చేస్తోన్న వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.

మౌలా మేరా పాటకు మీనాక్షి అద్భుతంగా నాట్యం చేసింది. క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి డాన్స్ తో మైమరపించింది. ఆమె డాన్స్ చేస్తుంటే చూస్తూ ఉండిపోవాలనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మీనాక్షి తల్లి మంజు వారియర్ సైతం మంచి డాన్సర్. నటన నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా.. డాన్స్ శిక్షణలో ఉండిపోతుంది. అయితే మీనాక్షి హీరోయిన్లకు ఏం తక్కువ కాదు.

ఇవి కూడా చదవండి

మీనాక్షి చెన్నైలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే ఆమెను సినీపరిశ్రమలోకి ఆసక్తి లేదని.. తాను డాక్టర్ కావాలనుకుంటుందని గతంలో అనేకసార్లు మంజువారియర్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.