Tollywood : స్టార్ హీరోతో సిగరెట్ తాగుతూ కనిపించిన హీరోయిన్.. కట్ చేస్తే.. కెరీర్ క్లోజ్..
సినీరంగంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. షారుఖ్ కాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ అనుహ్యంగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది. ఆమె ఎవరో తెలుసా..
బాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో మెప్పించింది. వరల్డ్ వైడ్ భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఊహించని విధంగా ఆమె కెరీర్ క్లోజ్ అయ్యింది. ఆమె మరెవరో కాదు.. పాకిస్తానీ నటి మహీరా కాన్. కెరీర్, వ్యక్తిగత జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. విడాకులు, ఒంటరి మాతృత్వం, పాకిస్థాన్‌కు చెందిన ఇతర నటీనటులతో కలిసి భారతీయ సినిమాల్లో నటించకుండా నిషేధం విధించడం వంటి ప్రతి విషయాన్నీ చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో, మహీరా తన కెరీర్‌లో అత్యంత వివాదాస్పద వైరల్ ఫోటోను కూడా వెల్లడించింది.
BBC ఏషియన్ నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిరా ఖాన్ మాట్లాడుతూ..” ఇది గొప్ప హెచ్చు తగ్గుల సమయం. నా ప్రేక్షకులు నాతో చాలా దూరం ప్రయాణించారు. విడాకులు తీసుకోవడం, పిల్లల పెంపకం, ఎక్కువ కాలం ఒంటరి జీవితం గడపడం, ఓ హీరోతో సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్ కావడం… వేరే దేశంలో పని చేయకుండా నిషేధం విధించడం.. ఇవన్నీ చాలా ఛాలెంజింగ్‌గా ఉండేవి. అవి చాలా కష్ట సమయాలు” అంటూ చెప్పుకొచ్చింది.
మహిరా ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి స్మోకింగ్ చేస్తున్న ఫోటోస్ అప్పుడు నెట్టింట వైరలయ్యాయి. అప్పట్లో తన గురించి వచ్చిన వార్తలను గుర్తుచేసుకుంటూ.. “స్మోక్ చేస్తున్న ఫోటోతోపాటు ఓ ఆర్టికల్ చదివిన తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందా ?.. ఆ కథనంలో ఈ మహిళ పాకిస్థాన్‌లో అందరికంటే ఎక్కువ విజయాన్ని సాధించిందని రాసి ఉంది. ఎన్నో ప్రకటనలు. ఇక అంతా ముగిసింది అనుకున్నాను. ప్రతిరోజూ ఏడ్చాను. వ్యక్తిగత జీవితం, కెరీర్ పై ప్రభావితం చేసింది. నా పర్సనల్ లైఫ్ లో చాలా జరిగాయి” అని తెలిపింది.
2017లో మహిరా, రణబీర్ స్మోకింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఇద్దరు న్యూయార్క్ వీధుల్లో సిగరెట్ తాగుతూ కనిపించారు. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి.
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.