AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laila : ఇప్పుడున్న హీరోలలో అతడే నా క్రష్.. అతడి భార్య నన్ను చంపేస్తుంది.. హీరోయిన్ లైలా..

టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో లైలా ఒకరు. మొదట బాలీవుడ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నారు. శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి సరసన లైలా నటించిన ఈ సినిమా ఆమెకు తెలుగులో పెద్ద బ్రేక్ ఇచ్చింది.

Laila : ఇప్పుడున్న హీరోలలో అతడే నా క్రష్.. అతడి భార్య నన్ను చంపేస్తుంది.. హీరోయిన్ లైలా..
Laila
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2026 | 12:24 PM

Share

90లలో సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన బ్యూటీ లైలా. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. శ్రీకాంత్, వెంకటేశ్ వంటి హీరోల సరసన నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దాదాపు 22 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపైకి రీ-ఎంట్రీ ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘గోదారి గట్టుపైన’ అనే డైరెక్ట్ తెలుగు సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె టాలీవుడ్ రీఎంట్రీతో పాటు తమిళ స్టార్ హీరో సూర్యతో తనకున్న ప్రత్యేక బంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా “మీ తోటి హీరోల్లో ఎవరిపై క్రష్ ఉండేది?” అనే ప్రశ్నకు లైలా స్పందిస్తూ.. వెంటనే “సూర్య” అని సమాధానం ఇచ్చారు. ఆ వెంటనే నవ్వుతూ, “ఇది వింటే జ్యోతిక నన్ను చంపేస్తుంది” అంటూ సరదాగా అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

అయితే అది నిజమైన క్రష్ కాదని, తమ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఒక ప్రత్యేకమైన స్నేహ బంధం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. గతంలో సూర్య, లైలా కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్‌కి తిరిగి రావడంపై లైలా ఆనందం వ్యక్తం చేశారు. అయితే తనకు తెలుగులో నటించడం ఇష్టమే అయినప్పటికీ, వస్తున్న ఆఫర్లపై ఆమె కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు తనకు కేవలం రెగ్యులర్ తల్లి పాత్రలు లేదా సోదరి పాత్రలను మాత్రమే ఆఫర్ చేస్తున్నారని, అలాంటి పాత్రలు చేయడానికి తనకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

కేవలం నటనకు ప్రాధాన్యత ఉండి, కథను మలుపు తిప్పే బలమైన పాత్రలు వస్తేనే టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. గతంలో కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన లైలా, ఇప్పుడు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గోదారి గట్టుపైన’ చిత్రంలో ఒక కీలక పాత్రలో అలరించారు.

ఎక్కువ మంది చదివినవి : Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

సూర్య పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బిగ్ బాస్‏లోకి సీరియల్ బ్యూటీ.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ మళ్లీ వచ్చేస్తుంది.. ఇక ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..

Follow Us