Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ.. ఫోటోస్ చూశారా.. ?

అలనాటి అందాల తార ఖుష్బూ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. 90లలో ఆమె అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే .. తాజాగా ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

Tollywood : సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగుమ్మ.. ఫోటోస్ చూశారా.. ?
Kushboo
Follow us
Rajitha Chanti

|

Updated on: May 18, 2025 | 9:32 PM

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరోయిన్ ఖుష్బూ సుందర్. అందం, అభినయంతో దక్షిణాదిని ఏలేసింది. అప్పట్లో ఆమెకు అభిమానులు ప్రత్యేకంగా గుడి నిర్మించి ఆరాధించారు. 90లలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు వయసుకు తగిన పాత్రలు చేస్తూ సినిమాల్లో కొనసాగుతుంది. అలాగే అటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంది. అయితే ఖుష్బూ వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నటుడు ప్రభును ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే ప్రభుకు పెళ్లి కావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకుంది ఖుష్బూ. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది. అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిత్యం క్రేజీగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సినిమాల్లోకి రాకముందే స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఖుష్బూ కూతురు. ఇదిలా ఉంటే.. తన తల్లిలాగే అవంతిక సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అందం, అభినయంలో అవంతిక తల్లికి ఏమాత్రం తీసిపోదు. అయితే త్వరలోనే అవంతిక ఇండస్ట్రీ ఎంట్రీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి.

ఇక ఖుష్బూ చిన్న కూతురు అనంతిక ప్రస్తుతం డైరెక్టర్ మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక ఖుష్బూ ఫ్యామిలీ నుంచి త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఉండనుందనే టాక్ మాత్రం ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం అవంతిక ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

View this post on Instagram

A post shared by avantika (@avantikasundar)

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..