Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. కట్ చేస్తే.. ఈ బ్యూటీని పట్టించుకోని టాలీవుడ్.. ఆఫర్స్ లేక..
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా పలు యాడ్స్ చేస్తూ ఫేమస్ అయ్యింది. కట్ చేస్తే.. తెలుగులో మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫస్ట్ మూవీ విడుదలకు ముందే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సినీరంగుల ప్రపంచంలో ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత అదే క్రేజ్ కంటిన్యూ చేయలేకపోయారు. దీంతో ఆడపాదడపా చిత్రాల్లో నటించి నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఓ హీరోయిన్ మాత్రం తెలుగులో ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత కథానాయికగా రాణించింది. హీరోయిన్ గా తొలి చిత్రంతోనే కుర్రాళ్ల మది దొచేసింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కృతి శెట్టి. డైరెక్టర్ బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ఒకటి రెండు చిత్రాలు తప్ప మిగతా అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఆమెకు ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి.
చివరగా తెలుగులో మనమే సినిమాలో కనిపించింది కృతి. కానీ ప్రస్తుతం తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఎల్ఐకే, జీనీ సినిమాల్లో నటిస్తుంది. ఆ రెండు సినిమాలపైనే అంచనాలు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఇదివరకు మలయాళంలో తొలి చిత్రంతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ అరాచకం సృష్టిస్తోంది. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
అలాగే ఇకపై గ్లామర్ విషయంలోనూ ఎలాంటి హద్దులు లేకుండా ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతోనే తెలుగులో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కూడా అందుకోవడం లేదు. ప్రస్తుతం తమిళంలోనే వరుస సినిమాల్లో నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




