హాస్య నటిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి మెప్పించారు కోవై సరళ(Kovai Sarala). తన కామెడీ టైమింగ్ తో మెల్ కమెడియన్స్ ను సైతం ఆమె డామినేట్ చేసేవారు అనడంలో అతిశయోక్తి లేదు. కోవై సరళ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు నవ్వులే నవ్వులు. ముఖ్యంగా బ్రహ్మానందం కోవైలో సరళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. తెలుగు తమిళ్ భాషల్లో వందల్లో సినిమాలు చేశారు కోవై సరళ. అయితే గత కొంతకాలంగా కోవై సరళ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక ఆమె సినిమాల్లో కనిపించారేమో అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ సమయంలో ఆమె నటిస్తున్న సినిమానుంచి ఓ షాకింగ్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కోవై సరళ చివరిగా 2019 లో వచ్చిన `అభినేత్రి 2` సినిమాలో నటించారు. ఆతర్వాత ఆమె కొంత విరామం తీసుకొని ఇప్పుడు మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కోవై సరళ నటిస్తున్న తాజా తమిళ చిత్రం `సెంబి`. ఇందులో ఆమె సరికొత్త మేకోవర్ తో ఎవరూ గుర్తు పట్టలేని విధంగా కనిపించనున్నారు. విభిన్న కథలను తెరకెక్కించే దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని దర్శకుడు రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో కోవై సరళ కనిపిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేస్తోంది. సెంబి` ఓ బస్ జర్నీ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్న కోవై సరళ పాత్ర సినిమాలో చాలా కీలకంగా, ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తుంది.