
నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. శైలేష్ దర్శకత్వంలో వచ్చిన హైట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల కలెక్షన్స్ దాటింది. ఇక ఈ సినిమాలో నాని యాక్షన్ తో ఇరగదీశాడు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే నరకుడు. ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది నటి కోమలి ప్రసాద్ . ఈ చిన్నది హిట్ 3లో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి హీరోయిన్ శ్రీనిధి కంటే ఎక్కువగానే గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.
ప్రస్తుతం కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అలాగే హిట్ 3 సినిమా హిట్ అవ్వడంతో వరుస ఇంటర్యూలతో బిజీగా ఉంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను చేసిన సినిమాలన్నిటిలో లూజర్ సినిమా తన ఎంతో స్పెషల్ అని తెలిపింది కోమలి ప్రసాద్. ఆ సినిమా తనకు ఫస్ట్ బెస్ట్ ఆఫర్ అని చెప్పింది. తనకు ఆ సినిమా మహానటి ఫీల్ ఇచ్చిందని తెలిపింది కోమలి.
అలాగే ‘మోడరన్ లవ్’ అనే వెబ్ సిరీస్ చేశాను. ఈ సిరీస్ కూడా నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నాకు వెంకటేష్ మహా డైరెక్షన్ అనే చాలా ఇష్టం. ఆయన తీసిన కెరాఫ్ కంచరపాలెం అనే సినిమా నాకు చాలా ఇష్టం.. ఆ సినిమా ప్రతిసీన్ నన్ను ఆకట్టుకుంది. మామూలుగానే నాకు కొత్త వాళ్ళతో మాట్లాడటం అంటే చాలా సిగ్గు. కానీ కంచరపాలెం సినిమా చూసిన తర్వాత వెంటనే డైరెక్టర్ మహాకు సిగ్గు లేకుండా నేను మీతో వర్క్ చేయాలనుకుంటున్నా అని మెసేజ్ చేశా.. దాంతో నాకు మోడ్రన్ లవ్ స్టోరీ వెబ్ సిరీస్ ఛాన్స్ ఇచ్చాడు అని చెప్పుకొచ్చింది కోమలి ప్రసాద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.