War 2 Movie: ‘వార్ 2’ సినిమాలో ఆ హీరోయిన్ ఫిక్స్.. ఎన్టీఆర్ జోడిగా రామ్ చరణ్ హీరోయిన్ ?..

తన అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు తారక్. దీంతో ఇప్పుడు తారక్ కొత్త సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'దేవర'. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో తారక్ మరోసారి మాస్, యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి.

War 2 Movie: వార్ 2 సినిమాలో ఆ హీరోయిన్ ఫిక్స్.. ఎన్టీఆర్ జోడిగా రామ్ చరణ్ హీరోయిన్ ?..
Jrntr, Hrithik Roshan

Updated on: Nov 14, 2023 | 4:30 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగానే కాకుండా.. విదేశీ మూవీలవర్స్ సైతం ఫిదా అయ్యారు. తన అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు తారక్. దీంతో ఇప్పుడు తారక్ కొత్త సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో తారక్ మరోసారి మాస్, యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇటు దేవర సినిమానే కాకుండా అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతున్నారు తారక్. ఆయన హిందీలో నటిస్తోన్న మొదటి చిత్రం వార్ 2.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ సైతం మెయిన్ రోల్ పోషిస్తున్నారు. గతంలో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ కలిసి నటించిన సూపర్ హిట్ యాక్షన్ వార్ సినిమాకు ఇది సీక్వెల్. వార్ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్ తీసుకువస్తున్నారు. ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర మూవీ ఫేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో ఎప్పటిలాగే కబీర్ పాత్రలో కనిపించనున్నారు హృతిక్. కానీ తారక్ మాత్రం ఇందులో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ మూవీలో నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర విషయం ఫీల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అలియా భట్ ఒక ప్రధాన పాత్రతో కనిపించనుందని వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్ పై ఎలాంటి స్పష్టత రాలేదు. ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న పేరు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. వార్ 2 చిత్రంలో కియారా కనిపించనుందని టాక్. అయితే ఇందులో కియారా ఎన్టీఆర్ జోడిగా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో నటీనటుల గురించి మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం కియారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.