
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అంతే కాదు ప్రపంచ వ్యక్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుష్పతో తొలిసారి పాన్ ఇండియా సినిమా చేశారు అల్లు అర్జున్. ఇక ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు బన్నీ. ‘పుష్ప: ది రైజ్’ సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమా కథ, నటన, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవాటిలో స్పెషల్ సాంగ్ – “ఊ అంటావా మావా” ఒకటి ఈ పాట సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్‌గా మారింది. అంతే కాదు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను క్రియేట్ చేసింది ఈ సాంగ్.
“పుష్ప: ది రైజ్” సినిమాలో సమంతా “ఊ అంటావా మావా” అంటూ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది. ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో చంద్రబోస్ రచించారు, ఇంద్రావతి చౌహాన్ దీనిని ఆలపించారు. ఈ పాటలో సమంతా గ్లామరస్ లుక్, అమ్మడి డాన్స్ ప్రేక్షకులను ఆకర్షించాయి. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్‌తో కనిపించింది సామ్. ఈ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబ్ వీడియో కొన్ని రోజుల్లోనే మిలియన్ల వీక్షణలను సాధించింది. ఇప్పటికీ ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది.
అయితే ముందుగా ఈ సాంగ్ కోసం మరో హాట్ బ్యూటీని అనుకున్నారట. ఈ విషయాన్నీ స్వయంగా నిర్మాతే చెప్పారు. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీ కేతిక శర్మ. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో కేతిక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ విడుదలై పాపులర్ అయ్యింది. మొన్నటివరకూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపించింది. అలాగే రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో చిత్రనిర్మాత రవి పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా కేతిక శర్మను అనుకున్నాం అని తెలిపారు. ఇక రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఇక కేతిక ఇటీవల సింగిల్ సినిమాతో తొలి హిట్ అందుకుంది. శ్రీవిష్ణు నటించిన సింగిల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలతో ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.