
తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో తన నటనతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మరిపించింది. దీంతో తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. కానీ కీర్తి నటనకు.. ఆమె టాలెంట్‌కు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు మాత్రం రాలేదు. స్టార్ హీరోస్ సరసన కథానాయికగా మాత్రమే అలరించింది. కేవలం నటిగానే కాదు.. కంటెంట్ ప్రాధాన్యత బట్టి చెల్లి పాత్రలు చేసేందుకు సైతం సిద్ధమయ్యింది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లిగా కనిపించిన కీర్తి.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చెల్లిగా భోళా శంకర్ సినిమాలో నటించింది. ఆగస్ట్ 11న విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు కీర్తి నటించిన మామన్నన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా.. ట్రెడిషనల్ గా కనిపించిన కీర్తి కొద్ది రోజుల క్రితం తన స్టైల్ మార్చేసింది. సన్నజాజి తీగల మారడమే కాదు హద్దులు చెరిపి మరీ గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తోంది. కానీ.. ఆమె అభిమానులు మాత్రం కీర్తి చీరకట్టులో ఎవ్వరూ ఊహించలేనంత అందంగా ఉంటుందంటున్నారు.
కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్..
ప్రస్తుతం కీర్తి చీరకట్టులో ఉన్న ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న కీర్తి అక్కడకు నల్లరంగు చీరలో వెళ్లింది. స్లీవ్ లెస్ బ్లౌజ్.. అత్యద్భుతమైన చెవిపోగులో ఆమె రూపం చూడముచ్చటగా ఉంది. ఈ పోస్ట్ కు మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి.
కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్..
ఇటీవల కీర్తిసురేష్ భోళా శంకర్, మామన్నన్ వంటి సినిమా ప్రచార కార్యక్రమాలకు చీరకట్టులోనే వెళ్లింది. అందులో ఆమె రూపం అక్కడున్న వారిని కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తులలో కీర్తి అచ్చం మహానటిగా కనిపిస్తుందని.. చీరకట్టులో కీర్తి అద్భుతంగా ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్..
ఇక ఈ ఏడాది న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించింది కీర్తి. ఇందులో అచ్చ తెలుగు గ్రామీణ అమ్మాయి వెన్నెల పాత్రలో మరోసారి తన నటనతో మెప్పించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేయడమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రూ.118 కోట్లు రాబట్టింది.
కీర్తి సురేష్ ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.