Keerthy Suresh: ఆ సవాళ్ళను మనస్పూర్తిగా ఆస్వాదిస్తున్నా.! కీర్తిసురేష్ ఆసక్తిగా కామెంట్స్
బేబీ జాన్ తర్వాత తెలియకుండానే కీర్తి సురేష్ కెరీర్‌లో చిన్న బ్రేక్ అయితే వచ్చింది.. పెళ్లైంది కదా ఆ మాత్రం గ్యాప్ రావడం సహజమే అంటున్నారు ఫ్యాన్స్. సెకండ్ ఇన్నింగ్స్ కోసం కాస్త టైమ్ అయినా ఇవ్వాలిగా అంటూ కీర్తికే సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఈ క్రమంలోనే అభిమానుల అంచనాలు నిలబెడుతూ.. వరస ప్రాజెక్ట్స్‌కే ఓకే చెప్తున్నారు ఈ కేరళ కుట్టి. రివాల్వర్ రీటా, కన్నివేడి సినిమాలతో త్వరలోనే రానున్నారు కీర్తి.

అందాల భామ కీర్తిసురేష్ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ కీర్తిసురేష్. టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ భామ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆతర్వాత హీరోయిన్ గా నటిస్తుంది. కీర్తిసురేష్ హీరోయిన్ గా తమిళ్ సినిమాతో పరిచయమైనప్పటకి.. మలయాళంలో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. 2015లో వచ్చిన ఇదు ఎన్న మాయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి.. ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
తెలుగులో ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కనిపించింది. అలాగే నాని నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. అంతే కాదు బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. బేబీ జాన్ సినిమాతో అక్కడ అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కెరీర్ పీక్ లో ఉండగానే కీర్తిసురేష్ పెళ్లిపీటలెక్కింది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సైలెంట్ అయ్యింది.
కొన్ని సినిమాలు కమిట్ అయినా కూడా అవి ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా కీర్తిసురేష్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషలకు సమానమైన ప్రాధాన్యత ఉంది. అన్ని భాషలను ఒకే లా చూస్తా.. అందుకే అన్ని భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయతినిస్తున్నా.. అంతే కాదు ఇలా ఇన్ని భాషల్లో నటించడం అనేది అనేక సవాళ్లతో కూడుకుంది.. అయినప్పటికీ ఈ ప్రయాణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
