Keerthy Suresh: మహానటి మంచి మనసు.. దసరా టీమ్‌కు గోల్డ్‌ కాయిన్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కీర్తి! ఏకంగా 130 మందికి..

|

Mar 20, 2023 | 6:53 AM

మహానటి కీర్తి సురేశ్‌ తన మంచి మనసు చాటుకుంది. విశాల హృదయంతో తన మనసూ అందమేనని నిరూపించుకుంది. వివరాల్లోకి వెళితే.. సర్కారు వారి పాట సినిమా తర్వాత కీర్తి తెలుగులో నటిస్తోన్న చిత్రం దసరా.

Keerthy Suresh: మహానటి మంచి మనసు.. దసరా టీమ్‌కు గోల్డ్‌ కాయిన్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కీర్తి! ఏకంగా 130 మందికి..
Keerthy Suresh
Follow us on

మహానటి కీర్తి సురేశ్‌ తన మంచి మనసు చాటుకుంది. విశాల హృదయంతో తన మనసూ అందమేనని నిరూపించుకుంది. వివరాల్లోకి వెళితే.. సర్కారు వారి పాట సినిమా తర్వాత కీర్తి తెలుగులో నటిస్తోన్న చిత్రం దసరా. న్యాచురల్‌ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడు. తెలంగాణలోని గోదావరిఖని సింగరేణి గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్‌, ట్రైలర్‌, నాని, కీర్తి సురేశ్‌ల స్టిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న చిత్రం మార్చి 30వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే దసరా సినిమాలోని టెక్నీషియన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్డ్‌ కాయిన్‌ను బహుమతిగా ఇచ్చిందంట కీర్తి. మహానటి తర్వాత మళ్లీ అలాంటి నటనకు స్కోప్‌ ఉన్న పాత్ర రావడం, షూటింగ్‌లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు గానూ బంగారు నాణెలు గిఫ్ట్‌గా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకంగా 130 మందికి ఇలా గోల్డ్‌ కాయిన్స్‌ను బహుమతిగా ఇచ్చిందంట కీర్తి.

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కీర్తి సురేశ్‌ మంచి మనసుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దసరా సినిమా విషయానికొస్తే.. నేను లోకల్‌ తర్వాత మరోసారి కలిసి నటిస్తున్నారు నాని, కీర్తి సురేశ్‌. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సముద్రఖని, సాయికుమార్‌, పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో మార్చి 30న దసరా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..