Keerthi Suresh: కరోనా పుణ్యమా అని ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. మొన్నామధ్య కరోనా కారణంగా థియేటర్స్ మూసివేయడంతో ప్రేక్షకులంతా ఓటీటీల వైపు చూశారు. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ ఓటీటీ సంస్థలు మాత్రం జోరు పెంచుతూనే ఉన్నాయి. రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కూడా నెల రెండు నెలల్లోనే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి. మరో వైపు ఇంకా కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు తక్కువే వాటిలో సూర్య నటించిన ఆకాశం నీహద్దు రా.. జైభీమ్ సినిమాలు అలాగే వెంకటేష్ నటించిన నారప్ప. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా తన సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసి హిట్ అందుకుంటా అంటుంది. ఆ బ్యూటీ ఎవరోకాదు ముద్దుగుమ్మ కీర్తి సురేష్.
క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు ‘వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు తెలుగులో సినిమాలు చేస్తూనే మరో వైపు తమిళ్ లోనూ ఆకట్టుకుంటుంది. కమర్షియాల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించిందది కీర్తి. ఇక మహానటి సినిమాతో ఈ అమ్మడు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మరో వినితనమైన కథ తో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. తమిళంలో కీర్తి ‘సానికాయిదం’ అనే సినిమా చేసింది. దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేశాడు. అప్పుడెప్పుడో ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆతర్వాత మళ్లీ సినిమా ఊసే లేదు.. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. గతంలో కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ సినిమాను స్ట్రీమింగ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం కూడా చేసుకున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలోనే బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ యూ అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం కీర్తి తెలుగులో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. అలాగే నాని హీరోగా రాబోతున్న దసరా సినిమాలో కీర్తి హీరోయిన్ గా చేస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :