Actress Kasturi: రజినీ కాంత్ అమెరికా టూర్ పై నటి కస్తూరి సంచలన కామెంట్స్.. క్లారిటీ కావాలంటూ..

|

Jun 28, 2021 | 4:35 PM

నటి కస్తూరి గురించి బుల్లితెర ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే గృహలక్ష్మీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కస్తూరీ.

Actress Kasturi: రజినీ కాంత్ అమెరికా టూర్ పై నటి కస్తూరి సంచలన కామెంట్స్.. క్లారిటీ కావాలంటూ..
Kasturi
Follow us on

నటి కస్తూరి గురించి బుల్లితెర ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే గృహలక్ష్మీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కస్తూరీ. ఇటీవల సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ.. మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు కస్తూరీ… స్వతాహాగా లాయర్ అవ్వడం.. సామాజిక అంశాల మీద పట్టు ఉండడం.. సమకాలీన రాజకీయ అంశాలపై కస్తూరీ సంధించే ప్రశ్నలు.. విశ్లేషణలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా కస్తూరీ మరో అంశం పై స్పందించారు.

సూపర్ స్టార్ రజినీ కాంత్ ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.. కానీ ఆరోగ్య కారణాల వలన మధ్యలోనే ఆ ఆలోచనను మానుకున్నారు. ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమా అన్నాతే షూటింగ్ పూర్తి చేసుకున్న సూపర్ స్టార్.. కొన్ని అనారోగ్య సమస్యల వలన అమెరికాకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే విషయంపై నటి కస్తూరీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా రోజులుగా మన ఇండియన్స్ కు అమెరికా వెళ్లెందుకు పర్మిషన్ లేదు. అలాంటి పరిస్థితిలో రజినీ ఎలా వెళ్లారని ప్రశ్నించింది. హెల్త్ ఎమర్జెన్సీ అయినా మనకు అక్కడికి వెళ్లడానికి పర్మిషన్ లేదు.. కానీ రజినీ ఎలా వెళ్లారనేది అర్థం కావడం లేదు. అప్పుడేమో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడేమో ఇలా వెళ్లారు. ఏం అర్థం కావడం లేదు. రజినీ సర్ ప్లీజ్ అన్నీ క్లారిటీగా చెప్పండి. మేయో క్లినిక్ అంటే అది గుండెకు సంబంధించింది. మరీ రజినీ సర్ ఆరోగ్య సమస్య ఏంటీ ? అంటూ చాలా ప్రశ్నలు గుప్పించింది.

 

ట్వీట్..

Also Read: 12వ శతాబ్దంలో మట్టితో క‌ట్టిన‌ గుండ్రటి అపార్ట్‌మెంట్లు.. విపత్తులు సైతం తట్టుకుంటున్న వైనం.. ఇప్ప‌టి ఇంజ‌నీర్లు షాక్

Ancient Humans: చైనాలో లక్షా నలభై ఏళ్ళనాటి మానవ శిలాజం.. చతురస్రాకారపు కళ్ళతో నివసించిన డ్రాగన్ మేన్ ఆనవాళ్లు!