Kasthuri Shankar: అంత చిన్న చూపేందుకు.. తెలుగు వారిపై నోరుపారేసుకున్న కస్తూరి..
కాంట్రవర్సీకి.. కస్తూరికి విడదీయరాని బంధం ఉందేమో.. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కిన ఈ నటి మరోసారి నోరుపారేసుకున్నారు.. ఈసారి తెలుగువాళ్ల చరిత్రకు కొత్త భాష్యం చెప్తూ అగ్గి రాజేశారు..
తెలుగు వారిపై అక్కసు వెళ్లగక్కారు నటి కస్తూరి. తమిళనాడులో ఉన్న తెలుగు వారిని కించపరుస్తూ మాట్లాడారామె. 300 ఏళ్ల క్రితం తెలుగు వారు వలస వచ్చి.. ఇక్కడ అంతఃపురంలో సేవలు చేసేవారంటూ మాట్లాడారు కస్తూరి. కస్తూరి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు తమిళనాడు బీజేపీ ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సోదర భావంతో మెలిగే తెలుగు, తమిళ ప్రజల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చిచ్చుపెడతాయన్నారు. కాంట్రవర్సీకి.. కస్తూరికి విడదీయరాని బంధం ఉందేమో.. ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కిన ఈ నటి మరోసారి నోరుపారేసుకున్నారు.. ఈసారి తెలుగువాళ్ల చరిత్రకు కొత్త భాష్యం చెప్తూ అగ్గి రాజేశారు.. నిన్న చెన్నైలో కస్తూరి మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.
