Tollywood: సాదాసీదాగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్!

కలువ కళ్లు.. చంద్రబింబం వంటి మోము.. ఒకప్పుడు బొద్దుగా, చాలా లావుగా ఉండేది. ఇప్పుడు తను సన్నజాజిలా, చందమామలా మెరిసిపోతుంది. ఆమే, ఈమె అంటే మీరే కాదు ఎవ్వరూ నమ్మరు. అంతలా మారిపోయింది. కనిపెట్టారా.. . క్లూ ఏంటంటే.. తను తెలుగమ్మాయి.... తను డాక్టర్ కూడా...

Tollywood:  సాదాసీదాగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్!
Actress
Follow us

|

Updated on: Jun 09, 2024 | 4:03 PM

హీరోయిన్ కాదు.. నేను నటిని అనిపించుకోవాలని అనుకునేవాళ్ల సంఖ్య ఇప్పుడు పెరిగిపోయింది. హీరోయిన్ అంటే స్కిన్ షో చేయడం, పాటలలో డ్యాన్స్ చేయడం తప్ప ఏముంటుంది. అదే మంచి నటిగా పేరు తెచ్చుకుంటే కెరీర్ ఎక్కువకాలం కొనసాగుతోంది. అందుకే డీ గ్లామరైజ్డ్ పాత్రలకు కూడా సై అంటున్నారు కొంతమంది హీరోయిన్స్. తమ పాత్ర నిడివి తక్కువున్నా సరే ఇంపాక్ట్ ఉంటుందంటే చాలు సై అంటున్నారు. రెమ్యునరేషన్ తక్కువైనా నో ప్రాబ్లం అని… తమ క్యారెక్టర్ బాగుండాలని మేకర్స్‌కు హింట్స్ ఇస్తున్నారు. చిన్న చిత్రాల్లో.. వచ్చిన అవకాశాలను సద్వినియోగ పర్చుకుంటూ వారెవ్వా అనిపిస్తున్నారు. ఇదిగో ఈ బ్యూటీ ఆ కోవకు చెందినదే. చేసిన చాలా సినిమాల్లో డీ గ్లామర్ పాత్రలు పోషించిన అమ్మడికి ఇప్పుడు అలాంటి పాత్రే  అవార్డును తీసుకొచ్చింది.

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గమనించారు కదా.. చూడటానికి చాలా సాదాసీదాగా ఉన్న ఈమె టాలీవుడ్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి రాక ముందు ఇలా పక్కింటి అమ్మాయిలా ఉన్న ఈ చిన్నది.. తెరపై చాలా పద్దతిగా కనిపిస్తూ.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలతో సెగలు రేపుతోంది.  ఇప్పుడు గ్లామరస్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా టర్న్ అవుతున్న ఈమె.. మన తెలుగమ్మాయే. చాలా మంది హీరోయిన్లు.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ ఈ నటి డాక్టరై.. ఆ తర్వాత నటి అయ్యింది. 2018 మిస్ తెలంగాణగా సత్తా చాటింది డాక్టర్ సాయి కామాక్షి భాస్కర్ల. చైనాలో MBBS చేసి.. అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టరుగా పనిచేసింది. తర్వాత మోడల్ రంగంలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత మిస్ తెలంగాణ పోటీల్లో విజేత అయ్యింది.

ప్రియురాలు అనే మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ తెలుగమ్మాయి.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రౌడీ బాయ్స్, మా ఊరి పొలిమేర, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2, ఓం భీమ్ బుష్ వంటి సినిమాల్లో నటించింది. అలాగే ఝాన్సీ, సైతాన్, దూత వెబ్ సిరీస్‌ల్లో మంచి పాత్రలు చేసింది. కానీ ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది మాత్రం పొలిమేర మూవీనే. లక్ష్మి పాత్రలో సత్యం రాజేష్ భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది. గతంలో చాలా చబ్బీగా ఉండే ఆమె.. సినిమాల కోసం నాజుగ్గా మారింది. ఆమె చేసినవి చాలా వరకు డీ గ్లామరస్ రోల్సే.  ఆ పాత్రే ఆమెకు అవార్డును తెచ్చిపెట్టాయి. న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో కామాక్షికి అరుదైన గౌరవం దక్కింది. పొలిమేర 2లో ఫెర్ఫామెన్స్‌కు గానూ ఉత్తమ నటిగా  అవార్డు వచ్చింది. ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్టులతో బిజీ అయిపోయింంది కామాక్షి.

View this post on Instagram

A post shared by ahavideoin (@ahavideoin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
నార్త్ సినిమాల బిజినెస్‌ కోసం సౌత్‌ మీద దృష్టిపెడుతున్న మేకర్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చెర్రీ లీక్స్
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
కేజీఎఫ్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్న హీరో
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
పుష్ప2 తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి ??
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
తెలంగాణ బీజేపీ కొత్త సారధిపై కమలం కసరత్తు.. రేసులో ఉన్నది వీరే..
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత బోల్డ్‌గా మారిపోయిందో తెలుసా?
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
చిటికెడు మిరియాల పొడిని ఈ నూనెలో కలిపి రాస్తేచాలు తెల్లజుట్టుమాయం
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
టాస్ గెలిచిన న్యూజిలాండ్.. విజయంతో వీడ్కోలు చెప్పేనా..
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో
బైక్‌పై వస్తున్న వ్యక్తిని ఆపిన పోలీసులు.. అతని బ్యాగులో