దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు విచ్చేసిన ఆమె వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేసింది. అయితే తిరుమలలో జాన్వీ వెంట శిఖర్ పహారియా కూడా కనిపించాడు. అతను కూడా సాంప్రదాయంగా పంచెకట్టులో ముస్తాబై శ్రీవారిని దర్శించుకున్నాడు. వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జాన్వీ, పహారియా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కలిసికట్టుగా తిరుమలకు రావడంతో వీరి డేటింగ్ రూమర్లకు మరింత బలన్నిచ్చాయి.
తాజాగా ఎయిర్‌పోర్టులో కూడా ఇద్దరూ జంటగానే దర్శనమిచ్చారు. అలాగే నీతా అంబానీ కల్చరల్ ఈవెంట్‌కు బోనీ కపూర్‌తో కలిసి వెళ్లాడు శిఖర్. దీంతో జాన్వీ ప్రేమకు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే తమ డేటింగ్ వ్యవహారంపై అటు జాన్వీ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
కాగా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న జాన్వీకపూర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందితున్న ఈ సినిమా ‘ఎన్టీఆర్ 30’ (వర్కింగ్ టైటిల్) షూటింగ్ మార్చి 31 ప్రారంభమయింది. ఎన్టీఆర్, జాన్వీకపూర్‌పై తీసిన తొలిషాట్‌కు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి క్లాప్‌కొట్టారు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరికొన్ని అప్‌డేట్స్ రానున్నాయి.
#WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A
— ANI (@ANI) April 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..