
ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో అలరించింది హీరోయిన్ ఇంద్రజ. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఆమె.. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూ మరోసారి సినీప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే అమ్మాయిలు వేసుకునే డ్రెస్సింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇంట్లో ఉన్నట్లే బయట కూడా ఉంటాం అంటే నడవదని.. ఇబ్బందికరంగా డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుందని అన్నారు. అన్నింటిని భరిస్తే అలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఇంద్రజ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇంద్రజ మాట్లాడుతూ.. “నా బాడీ నా ఇష్టం. నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకున్నాను.. నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ నీ ఇష్టం అని పబ్లిక్ గా బట్టలు వేసుకుని రావడం.. జనాల మధ్యలో.. మీడియాలో నీ ఫోటోస్, వీడియోస్ పెట్టడం నీకు ఎంత హక్కు ఉందని నువ్వు అంటున్నావో.. న డ్రెస్సింగ్ అభ్యంతకరంగా.. చీప్ గా ఉన్నప్పుడు దాని గురించి అడిగే హక్కు కూడా ఎదుటివారికి ఉంటుంది. పబ్లిక్ లో ఇలా ఉండాలని ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్నట్లు.. ఇంట్లో మాట్లాడినట్లు బయట ఉంటాను అంటే కుదరదు. పబ్లిక్ లో ఎలా ఉండాలి అనేది ఒక కోడ్ ఉంటుంది. అది నీ ఇష్టం నేను వేసుకుంటాను అంటే.. ఓకే కానీ.. వేసుకున్నాక కామెంట్స్ చేయొద్దు అనే రైట్స్ మాత్రం నీకు లేవు” అని అన్నారు.
“అసభ్యకరమైన బట్టలు మీ పబ్లిక్ లో కాదు.. మీ పర్సనల్ ప్లేస్ లో వేసుకోండి.. పబ్లిక్ లో వేస్తే అలాగే కామెంట్స్ చేస్తారు. అన్నింటినీ భరిస్తేనే బయట అలాండి డ్రెస్సింగ్ వేసుకోండి. లేదంటే వేసుకోవద్దు. కొందరి డ్రెస్సింగ్ చూస్తే ఇవేమి డ్రెస్సులు అనిపిస్తుంది. అలాంటి కాస్ట్యూమ్స్ తో ఎలా కంఫర్ట్ గా ఉంటారు అనిపిస్తుంది. అందంగా ఉండాలి.. ట్రెండింగ్ గా ఉండాలి. కానీ ఛీ అనేలా ఉండకూడదు. సెలబ్రిటీలు ఈ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండాలి. మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారు కాబట్టి. మనల్నీ ట్రీట్ చేసే విధానం బట్టల్లో కూడా ఉంటుంది “అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..