
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలాయానా ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే ఆగస్ట్ 1 ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి కోవా ఫియోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టినట్లుగా తెలుపుతూ తన సంతోషాన్ని పంచుకుంది. ఇక అక్టోబర్ 1తో తన కొడుకుకు రెండు నెలలు నిండాయి. ఈ సందర్భంగా తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోను ఇలియానా షేర్ చేస్తూ ఆనందంగా ఉందని తెలిపింది. తన భుజంపై కుమారుడు సేద తీరుతుండగా.. ఆమె సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ అప్పుడే రెండు నెలలు అయింది అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఇలియానా. గతంలో ప్రెగ్నెన్సీ ఫోటోస్ షేర్ చేసిన ఇలియానా.. తన కొడుకు ముఖాన్ని తొలిసారి రివీల్ చేసింది. ఇలియానా పోస్ట్ పై బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు స్పందిస్తూ హార్ట్ ఎమోజీస్ షేర్ చేస్తూ.. క్యూట్ బేబీ.. బెస్ట్ మథర్, కొడుకు.. మీపై దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇలియానా. దాదాపు స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు రావడంతో టాలీవుడ్ కు దూరమయ్యింది. ఆ తర్వాత అక్కడ సైతం సైలెంట్ అయ్యింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తాను ప్రెగ్నెంట్ అంటూ అనౌన్స్ చేసి షాకిచ్చింది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. బాయ్ ఫ్రెండ్ ఫోటోస్ నెట్టింట పంచుకుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్ ముఖం కనిపించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంది ఈ బ్యూటీ.
ఇక ఇలియానా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు ఇలియానా. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.