దేవదాసు సినిమాతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది గోవా బ్యూటీ ఇలియానా. మహేశ్ బాబు పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయాలు అందుకుంది. రణ్‌బీర్ కపూర్‌తో బర్ఫీ వంటి హిట్ సినిమాలు ఇల్లీ బేబీ ఖాతాలో ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆమెకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమాలు హిట్ కాకపోవడంతో అవకాశాలు కూడా కరువయ్యాయి. దీంతో చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయిందీ అందాల తార. అయితే ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది ఇలియానా . పెళ్లి కాకుండానే తల్లికావడమేంటని నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. మరొకరు సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఇటీవల తొలిసారి బేబీ బంప్ తో ఉన్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసి మరోసారి తన ప్రెగ్నెన్సీ వార్తను కన్‌ఫార్మ్ చేసింది. తాజాగా మరోసారి తన ప్రెగ్నెన్సీ ఫొటోలను షేర్ చేసింది ఇలియానా. తన బేబీ బంప్ కనిపించేలా ఫొటోకు ఫోజులిస్తూ వాటిపి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే ప్రెగ్నెన్సీని బయటపెట్టిన ఇలియానా తన రిలేషన్ షిప్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో నెటిజన్లు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసింది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు 2019లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో పడిందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..