Ileana D’Cruz: ఇలియానా సాహసం.. ఎడిట్ చేయని ఫోటో షేర్ చేసి షాకిచ్చిన ముద్దుగుమ్మ..

దేవాదసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇలియానా (Ileana). మొదటి సినిమాతోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Ileana D’Cruz: ఇలియానా సాహసం.. ఎడిట్ చేయని ఫోటో షేర్ చేసి షాకిచ్చిన ముద్దుగుమ్మ..
Ileana D Cruz

Updated on: Feb 05, 2022 | 11:36 AM

దేవాదసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇలియానా (Ileana). మొదటి సినిమాతోనే యూత్ లో తెగ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ ఓ రెంజ్‍లో దూసుపోయింది ఈ అమ్మడు. అయితే ఉన్నట్టుండి ఇలియానా బొద్దుగా మారడంతో అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. దీంతో మళ్లీ సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. అయితే ఇలియానా.. వెండితెరపై అంతగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోష్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‏లో టచ్‏లో ఉంటుంది. తాజాగా ఇలియానా తన ఇన్‎స్టాలో షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బోద్దుగా ఉండే తన రియల్ ఫోటోను ఏమాత్రం ఎడిట్ చేయకుండా పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. సన్నగా కనిపించేందుకు ఎడిట్ చేసే యాప్స్ అన్నింటిని తాను డెలిట్ చేసినట్లు చెప్పుకొచ్చింది ఇలియాన.. “మీరు సన్నగా మరింత టోన్డ్.. ఇంకా అందంగా కనిపించేందుకు.. మీ శరీరాన్ని చాలా అప్రయత్నంగా మార్చుకునే యాప్స్ లలోకి వెళ్లడం చాలా సులభం. నేను ఆ యాప్స్ అన్నింటిని డెలిట్ చేశాను. అందుకు నేను గర్వపడుతున్నాను. ఇది నేను ప్రతి అంగుళం, ఇదే నా శరీరాకృతియ. ఇప్పుడు నేను అందరినీ హగ్ చేసుకుంటున్నాను ” అంటూ క్యాప్షన్ ఇస్తూ.. నువ్వు అందంగా ఉన్నావు..అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. ఇలియానా చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

Ileana

గతంలో ఇలియానా బాడీ డైస్మార్పికి డిజార్డర్ తో ఇబ్బంది పడ్డానని.. దాంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపింది. సమస్యలను అధిగమించడానికి తనకు మానసిక చికిత్స ఉపయోగపడిందని తెలిపింది.

Also Read:  Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..

Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..

Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..

Singer Sunitha: తన భర్త గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్‏కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సింగర్ సునీత..