Himaja: రేవ్‌ పార్టీ వార్తలపై స్పందించిన నటి హిమజ

Ram Naramaneni

|

Updated on: Nov 12, 2023 | 7:01 PM

 ఈ పార్టీలో పలువురు సినీనటులు పాల్గొన్నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. సుమారు 15 లీటర్ల లిక్కర్‌తో పాటు సౌండ్‌ సిస్టమ్‌ను హిమజ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లిక్కర్‌ పార్టీపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్‌ యాక్ట్ కింద నటి హిమజతో పాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధి జేబీ వెంచర్‌లోని నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ విల్లాలో రేవ్ పార్టీ జరిగిందన్న ఆరోపణలపై ఆమె స్పందించారు. ఇంట్లో పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరో సమాచారమిస్తే పోలీసులు వచ్చి తనిఖీలు చేశారని.. వారికి పూర్తిగా వారికి సహకరించామన్నారు హిమజ. తాను అరెస్టు కాలేదని. ఇంట్లోనే దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు వీడియో రిలీజ్ చేశారు.

ఈ పార్టీలో పలువురు సినీనటులు పాల్గొన్నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. సుమారు 15 లీటర్ల లిక్కర్‌తో పాటు సౌండ్‌ సిస్టమ్‌ను హిమజ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లిక్కర్‌ పార్టీపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలో భాగంగా ఎక్సైజ్‌ యాక్ట్ కింద నటి హిమజతో పాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.