Hamsa Nandini: క్యాన్సర్‏తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..

|

Feb 24, 2022 | 3:40 PM

టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని (Hamsa Nandini) బ్రెస్ట్ క్యాన్సర్‏తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‏కు చికిత్స తీసుకుంటుంది. ఇప్పటివరకు

Hamsa Nandini: క్యాన్సర్‏తో పోరాటం చేస్తోన్న హీరోయిన్.. సర్జరీలకు సమయం వచ్చేసిందంటూ పోస్ట్..
Hamsanandini
Follow us on

టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని (Hamsa Nandini) బ్రెస్ట్ క్యాన్సర్‏తో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‏కు చికిత్స తీసుకుంటుంది. ఇప్పటివరకు ఆమెకు 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్స విజయవంతంగా పూర్తైందంటూ తన లేటేస్ట్ ఫోటోను ఇన్‏స్టాలో షేర్ చేసుకుంది. ” ఆనంద్.. నేను 16 సైకిల్స్ కీమోథెరపీ చికిత్స పూర్తిచేశారు. ఇప్పుడు నేను పూర్తిగా కీమో నుంచి కోలుకున్నాను.. కానీ నా పోరాటం ఇంకా ముగియలేదు. ఇందులో ఇంకా విజయం సాధించలేదు.. నేను తదుపరి యుద్దాలకు సిద్ధమయ్యే సమయం వచ్చేసింది.. ఇది సర్జరీలు చేయాల్సిన సమయం ” అంటూ చెప్పుకొచ్చింది హంసానందిని.

గతేడాది డిసెంబర్ చివరిలో తాను క్యాన్సర్‏తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది హంసానందిని.. తన తల్లి కూడా ఇదే సమస్యతో ప్రాణాలు కోల్పోయానని.. ఇప్పుడు తాను ఈ క్యాన్సర్‏తో పోరాటం చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. తాను గుండుతో ఉన్న పోటోలను షేర్ చేసింది హంసానందిని. ఈ వ్యాధిని నా జీవితాన్ని నిర్వచించనివ్వను.. నేను దీనిని చిరునవ్వుతో పోరాడి జయిస్తాను.. మళ్లీ చురుగ్గా.. బలంగా తెరపైకి వస్తానంటూ ట్వీట్ చేసింది.

అనుమానాస్పదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హంసానందిని. ఈమె అసలు పేరు పూనమ్.. అయితే అప్పటికే తెలుగులో చాలామంది హీరోయిన్స్ పూనమ్ పేరుతో ఉండగా..డైరెక్టర్ వంశీ సూచనమేరకు .. ఆమె తన పేరును హంసానందినిగా మార్చుకుంది. మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హంసానందిని.

Also Read: Ajith Valimai: అజిత్ పాన్ ఇండియా మూవీ ‘వలిమై’ ట్విట్టర్ రివ్యూ… సోషల్​మీడియా ట్రెండింగ్​

భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన ఈ అందాలతార ఎవరో గుర్తుపట్టారా?.. నాలుగేళ్ల క్రితం ఇదే రోజు మనకు దూరమైంది..

Manjula Ghattamaneni: నిన్న సితార.. నేడు మంజుల.. కళావతి హుక్‌ స్టెప్పులకు ఫిదా అవుతోన్న నెటిజన్లు..

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ సినిమాపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు.. వాటికి అనుమతి లేదంటూ ఆదేశాలు..