AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divya Bharti: దివ్య భారతి మరణానికి కారణం అదే.. 21 ఏళ్ల తర్వాత బయటపడిన నిజాలు..

సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్ దివ్య భారతి. మూడు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 13 సూపర్ హిట్స్ అందుకుని సంచలనం సృష్టించింది. 16 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఐదవ అంతస్తుల భవనంపై నుంచి కింద పడి మరణించింది.

Divya Bharti: దివ్య భారతి మరణానికి కారణం అదే.. 21 ఏళ్ల తర్వాత బయటపడిన నిజాలు..
Divya Bharathi
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2024 | 10:01 PM

Share

దివగంత నటి దివ్య భారతి మరణం ఇప్పటీకీ అభిమానుల మనసులో చెరగని చేదు నిజం. యావత్ భారతీయ సినీ పరిశ్రమలోనే ఆమె ఆకస్మిక మృతి కలకలం సృష్టించింది. 16 సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ డమ్ అందుకున్న అమ్మాయి 19 ఏళ్లకే మరణించింది. దివ్యభారతి మరణించి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ ఆమె మరణం వీడని మిస్టరీ. దివ్య భారతి మృతి గురించి నిత్యం షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు బాల్కనీ నుంచి పడి దివ్యభారతి మరణించగా.. ఆ సమయంలో ఆమె భర్త నిర్మాత సాజిద్ నడియాద్వాలాపై పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే సాజిత్ నిందితుడు కాదని బాలీవుడ్ నటి గుడ్డి మారుతి సంచలన విషయాలను బయటపెట్టింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుడ్డి మారుతి మాట్లాడుతూ.. “‘దివ్య మంచి అమ్మాయి. కానీ ఎప్పుడూ రెస్ట్ లెస్ గా ఉండేది. తన జీవితంలోని ప్రతి రోజూ ఈరోజే చివరి రోజు అన్నట్టుగా గడిపేది.. అప్పుడు ‘షోలా ఔర్ షబ్నం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 5న దివ్య మరణించింది, ఏప్రిల్ 4న నా పుట్టినరోజు. ఆరోజు మేము పార్టీ చేసుకున్నాము. గోవింద, దివ్య , సాజిద్ మరికొందరు కూడా పార్టీలో పాల్గొన్నారు. దివ్య పార్టీలో అందరితో మాట్లాడుతున్నప్పటికీ తాను ఎందుకో బాధపడుతుందని భావించాను. ఉదయాన్నే ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లాలనుకుంది. కానీ దివ్యకు వెళ్లడం ఇష్టం లేదు. దివ్య ఐదో అంతస్తులో ఉండేవారు.

ఆ రాత్రి నేను ఐస్ క్రీం తీసుకోవడానికి కిందకి వెళ్లాను. అప్పుడు నన్ను పై నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించింది. వెళ్లి చూసే సరికి దివ్య బాల్కనీలో కూర్చుని కనిపించింది. ఇక్కడ కూర్చోవడం సురక్షితం కాదని చెప్పాను. కానీ నాకు ఎత్తైన స్థలాలు అంటే భయం లేదని.. తనకు ఏం కాదని నాతో చెప్పింది. సాజిద్ కారు వచ్చిందో లేదో చేసేందుకు దివ్య కిందకు వంగి చూసింది.. అప్పుడు అనుకోకుండా ఆమె కిందపడి చనిపోయింది. డిజైనర్ నీతా లుల్లా కూడా ఆ ఘటన చూసింది. దివ్య మరణం తర్వాత ఆమె తల్లి పూర్తిగా కృంగిపోయింది. సాజిద్‌ కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ ఘటన జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గుడ్డి మారుతి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..