
సినిమా తారలకు, క్రికెటర్స్ మధ్య మంచి అనుబంధం ఉంటుంది. కానీ వారి బంధాల గురించి ఏదోక రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు అది నిజం కాగా.. మరికొన్ని మాత్రం రూమర్స్ గానే మిగిలిపోతాయి. ఇప్పుడు కొన్ని రోజులుగా క్రికెటర్ హార్దిక్ పాండ్య పేరు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అతడు బాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని ప్రచారం నడుస్తుంది. చాలా కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై సదరు హీరోయిన్ స్పందించింది. అసలం జరిగిందో క్లారిటీగా వివరించింది. ఆమె మరెవరో కాదు.. ఈషా గుప్తా.. ఇప్పుడిప్పుడే హిందీ సినిమా పరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా ఆమె పేరు హార్దిక్ పాండ్యా పేరుతో ముడిపడి ఉంది.
హార్దిక్ పాండ్యాతో ప్రేమ, డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ ఈషా గుప్తా మాట్లాడుతూ.. ”కొన్నినెలలపాటు మేమిద్దరం మాట్లాడుకున్నాం. మా మధ్య స్నేహం ఏర్పడింది. మేం డేటింగ్ లో ఉన్నామని అనుకోవట్లేదు. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు డేటింగ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉండొచ్చు.. ఉండకపోవచ్చని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ రిలేషన్ లోకి అడుగుపెట్టకుండానే విడిపోయాం. రెండు, మూడు సార్లు కలిసి ఉంటాం. కానీ కొన్ని నెలలపాటు మా రిలేషన్ కొనసాగింది. తర్వాత అది ముగిసిపోయింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈషా గుప్తా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఈషా గుప్తా విషయానికి వస్తే.. 2012లో జన్నత్ అనే హిందీ సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బేబీ, రుస్తుం, కమాండో 2 వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. వీడెవడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. 2019 తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..