Tollywood: ఏంటీ ఈ అమ్మడు ఇట్టా మారిపోయింది.. అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు నాజుగ్గా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. వరుస సినిమాలతో అలరించింది. కానీ ఈ బ్యూటీ ఖాతాలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు. దీంతో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసిన ఈ అమ్మడు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నిర్మాతలు పలు చిత్రాలు నిర్మించి సక్సెస్ అయ్యింది. ఇక ఇన్నాళ్లు బొద్దుగా కనిపించిన ఆ హీరోయిన్.. సడెన్ గా నాజుగ్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఛార్మీ కౌర్. నీతోడు కావాలి అనే సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమా తర్వాత నాగార్జున నటించిన మాస్ సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మాస్ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పించిన ఛార్మీ.. ఆ తర్వాత డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ పై వీరిద్దరు కలిసి పలు చిత్రాలను నిర్మించారు. ఇటీవలే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా పూరి ఓ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఛార్మీ.. ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరమైన తర్వాత కాస్త బొద్దుగా మారిన ఛార్మీ ఇప్పుడు సడెన్ గా అభిమానులకు షాకిచ్చింది. ప్రస్తుతం తాను 9 కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరింత బరువు తగ్గుతానని తెలిపింది. ఛార్మీ లేటేస్ట్ లుక్ పై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ సూపర్బ్ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




