AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Bhavana: పెళ్లై ఏడేళ్లు.. 4 సార్లు అబార్షన్.. రూమర్స్ పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన భావన..

తాజాగా హీరోయిన్ భావన తన గురించి కొన్నాళ్ల క్రితం వినిపించిన రూమర్స్ పై స్పందించారు. ఇన్నాళ్లకు మొదటిసారి మీడియా ముందు తన జీవితం.. వైవాహిక బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీకాంత్ నటించిన గాంధీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది భావన. ఇందులో ఆమె నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో కనిపించిన భావన అనుకోకుండా సినిమాలకు దూరమయ్యింది.

Actress Bhavana: పెళ్లై ఏడేళ్లు.. 4 సార్లు అబార్షన్.. రూమర్స్ పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన భావన..
Bhavana
Rajitha Chanti
|

Updated on: May 04, 2024 | 1:04 PM

Share

సాధారణంగా హీరోయిన్స్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదోక వార్త వైరలవుతుంది. ముఖ్యంగా కథానాయికల వ్యక్తిగత జీవితం, ప్రేమ, పెళ్లి గురించి అనేక రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. అయితే కొందరు హీరోయిన్స్ తమ గురించి వచ్చే అసత్యాలపై గట్టిగానే రియాక్ట్ అవుతుంటారు. ఇక మరికొందరు మాత్రం అంతగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటారు. తాజాగా హీరోయిన్ భావన తన గురించి కొన్నాళ్ల క్రితం వినిపించిన రూమర్స్ పై స్పందించారు. ఇన్నాళ్లకు మొదటిసారి మీడియా ముందు తన జీవితం.. వైవాహిక బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శ్రీకాంత్ నటించిన గాంధీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది భావన. ఇందులో ఆమె నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో కనిపించిన భావన అనుకోకుండా సినిమాలకు దూరమయ్యింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే భావన కిడ్నాప్ కు గురైంది. ఓ స్టార్ హీరో ఆమెను దుండగులతో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని అప్పట్లో వార్తలు వినిపించాయి. భావన కిడ్నాప్ వార్త అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో మలయాళీ నటుడు దిలీప్ ను నిందితుడిగా పరిగణిస్తూ అరెస్ట్ చేయగా.. కొన్నాళ్లకు బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. 2018లో నిర్మాత నవీన్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది భావన. ప్రస్తుతం మలయాళంలో నడికార్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న భావన తన గురించి వచ్చిన రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

ఎనిమిదేళ్ల క్రితం తన గురించి దారుణంగా రూమర్స్ సృష్టించారని తెలిపింది. అనూప్ మీనన్ ను పెళ్లి చేసుకున్నట్లు తప్పుడు వార్తలను సృష్టించారని.. అలాగే అనేకసార్లు అబార్షన్స్ అయ్యాయని రూమర్స్ క్రియేట్ చేశారని తెలిపింది. ఒకసారి ఏకంగా తాను చనిపోయానంటూ ప్రచారం చేశారని.. ఇలా ఎన్నో విధాలుగా తన గురించి.. తన జీవితం గురించి అసత్యాలను సృష్టించారని చెప్పుకొచ్చింది. “అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానని అన్నారు. అలాగే అలువాలో నాకు గర్భస్రావం అయ్యిందని.. కొచ్చిలో.. చెన్నైలో అబార్షన్స్ చేయించుకున్నానని ప్రచారం చేశారు. అబార్షన్ వల్లే నేను చనిపోయానని కొందరు అన్నారు. వాటిని ఇప్పుడు గుర్తుచేసుకుంటే తట్టుకోలేను. ఆ సమయంలో నా గురించి వచ్చిన రూమర్స్ విని మానసికంగా చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు బలంగా ఉంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us