Bhanu Sri Mehra: టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో కన్నీరు మున్నీరు

|

Dec 17, 2024 | 5:53 PM

క్రియేటర్ డైరెక్టర్ గుణ శేఖర్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా వరుడు. 2010లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో గుణ శేఖర్ చేసిన ప్రయోగం చాలామందికి గుర్తుంటుంది.

Bhanu Sri Mehra: టాలీవుడ్ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. తమ్ముడి అకాల మరణంతో కన్నీరు మున్నీరు
Actress Bhanusree Mehra
Follow us on

గుణ శేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన వరుడు సినిమా అందరినీ నిరాశపర్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మూవీ రిలీజ్ ముందు వరకు హీరోయిన్ ఫేస్ కనిపించనీయలేదు మేకర్స్. సినిమా థియేటర్లలోకి వచ్చాక అది కూడా ఇంటర్వెల్ ముందు హీరోయిన్ మొహాన్ని రివీల్ చేశారు. అయితే ఇంత సస్పెన్స్ మెయింటైన్ చేసినా వరుడు సినిమా ప్లాఫ్ గా నిలిచింది. పంజాబ్ లోని అమృత్ సర్ కు చెందిన భానుశ్రీ మెహ్రా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమెకు మొదటి తెలుగు సినిమా. దీని తర్వాత చిల్కూరు బాలాజీ , ప్రేమతో చెప్పన , మహారాజా శ్రీ గాలిగాడు , లింగడు-రామలింగడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, గోవిందుడు అందరి వాడేలే, రన్, మిస్ ఇండియా తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిందీ అందాల తాన. చివరగా 2022లో 10th క్లాస్ డైరీస్ అనే సినిమాలో కనిపించింది భానుశ్రీ మెహ్రా. పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయిందీ పంజాబీ ముద్దుగుమ్మ.

సినిమాలకు దూరంగా ఉన్న భాను శ్రీ మెహ్రా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా భానుశ్రీ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇటీవల ఆమె ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే తమ్ముడిని తలుచుకుని భావోద్వేగానికి లోనైంది భానుశ్రీ. సోషల్ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తుకు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

భానుశ్రీ ఎమోషనల్ పోస్ట్..

‘నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని నేను ఎలా నమ్మాలి? నువ్వు మా ధ్యన లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దు నెలకొంది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ’ అంటూ తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది భాను శ్రీ. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ,నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.

భానుశ్రీ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి