
యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ అనసూయ. జబర్దస్త్ కామెడీ షో తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. చలాకీ మాటలతో పాటు ఆకట్టుకునే అందంతో ప్రేక్షకులకను ఫిదా చేసింది. ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. చాలా సినిమాల్లో అనసూయ చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది. అదే సమయంలో సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం సినిమాలో రంగమత్తగా నటించి మెప్పించింది. ఈ సినిమాతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలతో బిజీ అయిపొయింది. ఈ మధ్య కాలంలో అనసూయ లేకుండా సినిమాలు ఉండటంలేదు అనడంలో సందేహం లేదు. చాలా సినిమాల్లో నటించింది అనసూయ. చిన్న చిన్న పాత్రలతో పాటు ప్రధాన పాత్రల్లోనూ నటిస్తుంది అనసూయ.
ఇక తాజాగా రజాకార్ సినిమాలను నటించింది అనసూయ. ఈ సినిమా నుంచి తాజాగా ఈ సినిమానుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. అనసూయ మీద తెరకెక్కించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ తాజాగా నివహించారు మూవీ మేకర్స్.
ఇదిలా ఉంటే ఈ సినిమాను బీజీపీ నాయకుడు నిర్మిస్తున్నారు. దాంతో అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోనూ అనసూయ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజాగా దీని పై అనసూయ క్లారిటీ ఇచ్చింది.రీసెంట్ గా జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అనసూయకు ఇదే ప్రశ్న ఎదురైంది. మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దాంతో అనసూయ మాట్లాడుతూ.. ‘రాజకీయం అనేది నా వల్ల కాదు. చెప్పాలంటే నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు. రాజకీయనాయకుల పని వాళ్లని చేయనిద్దాం’ అని చెప్పింది. సినిమా సమయంలోనూ మా మధ్య అలాంటి టాపిక్స్ రాలేదు అని క్లారిటీ ఇచ్చింది అనసూయ. ప్రస్తుతం అనసూయ పుష్ప 2 లో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..