ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది ఒక మాయరోగం. ఇది సోకితే.. ఆనక ముదిరితే మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరంటే ఇంకెవరు? ఎక్కువమంది బాధితులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలే. బెట్టింగ్ అలవాటుకు ఇంట్లో ఒక్కడు బానిసగా మారినా మొత్తం కుటుంబ వ్యవస్థే కూలిపోతోంది. ఈ గాయం లోతెంతో తెలీక.. ఇది కూడా అన్నిటిలాగే ఒక బిజినెస్ మాత్రమే అనే భ్రమల్లో పడిపోయి.. కొందరు తెలుగు సినిమా సెలబ్రిటీలు గుడ్డిగా బెట్టింగ్ యాప్స్‌ను భుజానికెత్తుకున్నారు. ఇది ఇప్పటికిప్పుడు మొదలైంది కాదు. నాలుగైదేళ్లుగా జరుగుతున్నదే. ఐనా సెలబ్రిటీల ప్రమోషన్లను సైబర్ క్రైమ్ పోలీసులు తేలిగ్గా తీసుకున్నారా..? ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.
సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్, చిన్న చిన్న యాక్టర్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఇలా అందరూ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఎంతో మంది యువత ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. అయితే ఈ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల పేరు కూడా రావడంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అనన్య నాగళ్ల కూడా బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది. తాజాగా ఓ న్యూస్ ఛానెల్‌లో జరిగిన డిస్కషన్ అనన్య మాట్లాడుతూ తన తప్పును ఒప్పుకుంది.
తెలిసి తెలుయక ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినట్టు తెలిపింది. దాని వల్ల ఇంత నష్టం జరుగుతుందని తెలియదని చెప్పుకొచ్చింది అనన్య. నా ప్రమోషన్ వల్ల నష్టపోయిన వారికి నేను తిరిగి డబ్బులు ఇచ్చాను అని తెలిపింది. అయితే తాను తెలియక తప్పు చేశాను.. క్షమించండి అని అనన్య అన్నారు. ఒక వీడియో స్టోరీ షేర్ చేసినందుకు తనకు రూ. 1.20 లక్షలు ఇచ్చారు అని తెలిపింది. బెట్టింగ్ యాప్ వల్ల నష్టం జరుగుతుందని తెలిసాక.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మానేశాను అని తెలిపింది అనన్య.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.