Actress: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

సావిత్ర కాలం నుంచి ఇది జరుగుతోందని.. అప్పుడే మాట్లాడే ధైర్యం లేకపోయిందని.. ఆమె తెలిపారు. ఆమె మాట్లాడుతూ, 'ప్రతిభ ఉన్నా, అవకాశాలు కావాలంటే కమిట్‌మెంట్స్ లాంటి హామీలను మనం వినాల్సి వస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

Actress: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Tollywood

Updated on: Dec 13, 2025 | 1:29 PM

టాలీవుడ్ సీనియర్ నటి ఆమని సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొత్తేం కాదని.. సావిత్రి కాలం నుంచే ఉన్నాయని ఆమె తెలిపారు. అప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఇలాంటి విషయాలు బయటకు రాలేదని.. ప్రస్తుత రోజుల్లో ప్రతీ చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతోందన్నారు. ఒక సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా, మర్యాదను నిలబెట్టుకుంటూ చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలంటే కష్టమేనని హీరోయిన్ ఆమని అన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం కొత్తది కాదని పేర్కొన్నారు. సావిత్ర కాలం నుంచి ఇది జరుగుతోందని.. అప్పుడే మాట్లాడే ధైర్యం లేకపోయిందని.. ఆమె తెలిపారు. ఆమె మాట్లాడుతూ, ‘ప్రతిభ ఉన్నా, అవకాశాలు కావాలంటే కమిట్‌మెంట్స్ లాంటి హామీలను మనం వినాల్సి వస్తుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు.. పాత తరం హీరోయిన్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ అప్పట్లో సొసైటీ భయం, కుటుంబ పరువు కారణంగా ఎవ్వరూ బయటికి చెప్పలేకపోయారు’ అని అన్నారు.

తన కెరీర్ మొదట్లో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని.. అయితే తాను రాజీ పడకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆమని తెలిపారు. తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంటూ.. ఒక ఫైనాన్షియర్ సినిమా కథ చెప్పాలని తనని ఒంటరిగా బీచ్‌కి రమ్మన్నారు అంటూ ఆమె తెలిపారు. సినిమా కథ చెప్పాలి అంటే దర్శక నిర్మాతలు పిలిపించాలి కానీ ఇలా ఫైనాన్షియర్ రమ్మనడం ఏంటి అని సందేహం వచ్చి తన తల్లి అక్కడికి వెళ్లొద్దు అని చెప్పినట్టుగా ఆమె తెలిపారు. అదేవిధంగా ఒక తమిళ సినిమాలో నటిస్తున్న సమయంలో ఏదో మార్క్ ఉంటుంది.. బట్టలు విప్పేసి చూపించమని అడిగారు.. తనతో పాటు ఆ సమయంలో తన తల్లి, తమ్ముడు ఉన్నారని ఆమె తెలిపారు.  వెంటనే అక్కడ నుంచి వెనక్కి వచ్చేశానని ఆమని అన్నారు. ‘అవకాశాలు కోల్పోయినా సరే, ఆత్మగౌరవం కోల్పోవద్దని నేను నమ్మాను. అందుకే కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమయ్యాను’ అని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి పరిస్థితుల్లో మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇదొక మంచి మార్పు. అయితే ఇది కేవలం మాటల్లోనే కాదు.. వర్క్ ప్లేస్‌లోనూ ఉండాలి. షూటింగ్స్ సమయంలో సేఫ్ వర్క్ ఎన్విరాన్‌మెంట్, కంప్లైంట్ బ్లాక్స్ లాంటివి ఏర్పాటు చేయాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..