Aditi Rao Hydari: నేను వేసుకోవాలనుకున్న డ్రస్సులే వేసుకుంటా.. అదితి రావు హైదరి హాట్ కామెంట్స్
భారత్ నుంచి పలువురు తారలు విభిన్న దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిసారు. ఫ్రాన్స్ వేదికగా కొనసాగిన 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా ముగిసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు.

కేన్స్ 2023 ఫిల్మ్ ఫెస్టివల్ 16న ప్రారంభం కాగా.. భారత్ నుంచి పలువురు తారలు విభిన్న దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిసారు. ఫ్రాన్స్ వేదికగా కొనసాగిన 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గ్రాండ్‌గా ముగిసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలు పోయారు ముద్దుగుమ్మలు. రకరకాల డ్రెస్సులతో అదరగొట్టారు. స్టేజ్‌పై ఫోజులిస్తూ అలరించారు. అంగరంగ వైభవంగా వివిధ దేశాల తారలు, నటీనటులు, టెక్నీషియన్స్, డిజైనర్లు, మోడళ్లతో కేన్స్ కిటకిటలాడింది. బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ వేడుకల్లో తమ అందాలతో అదరగొట్టారు. ఈ క్రమంలోనే అదితి రావు హైదరి కూడా ఈ వేడుకలో మెరిశారు.
ఫిల్మ్ ఫెస్టివల్ రెండో సారి మెరిశే అవకాశం అందుకున్నారు అదితి రావు హైదరి. ఇక ఈ ఫిల్మ్ ఫెస్టివల్ రెండో సారి పాల్గొనడం పై స్పందించింది అదితి. ఆమె మాట్లాడుతూ.. గత సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పాల్గొనడం నాకు కొత్తగా.. కాస్త నిరుత్సాహంగా అనిపించింది. కానీ ప్రతి అడుగు ఆత్మవిశ్వాసంతో వేయాలి. నేను వేసుకోవాలనుకున్న డ్రస్సులే వేసుకుంటా అని తెలిపింది.
అలాగే నా షూటింగ్ షెడ్యూల్స్ టైట్ గా ఉన్నాయి. కొన్ని సినిమాలకు కమిట్ అయ్యి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.. నేను ఖచ్చితంగా షూటింగ్స్ చేయాల్సిందే. ఎందుకంటే సినిమా నా మొదటి ప్రాధాన్యత. రెడ్ కార్పెట్ మీద నడవడం చాలా సరదాగా ఉంటుంది. ప్రత్యేకంగా అనిపిస్తుంది. ముందు ముందు దీనికి నేను మరింత అలవాటు అవుతా అని తెలిపింది.




