Abhirami: ముద్దు సీన్ మూడు సెకన్లే.. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. హీరోయిన్ సీరియస్..

కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా థగ్ లైఫ్. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. మరోవైపు థగ్ లైఫ్ చిత్రం పలు వివాదాల్లోనూ చిక్కుకుంటుంది. ఇటీవల కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ తీవ్ర దుపారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీ ట్రైలర్ లో వచ్చిన సీన్స్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Abhirami: ముద్దు సీన్ మూడు సెకన్లే.. ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు.. హీరోయిన్ సీరియస్..
Abhirami

Updated on: May 29, 2025 | 2:07 PM

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో త్రిష, శింబు, అభిరామి వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమాపై మరింత ఆసక్తిని కలిగించింది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో 70 ఏళ్ల వయసున్న కమల్ తనకంటే చాలా చిన్న వయసున్న నటితో ముద్దు సీన్స్ చేయడంపై నెటిజన్స్ విమర్శలు గుప్పించారు. ఇందులో నటి అభిరామి, కమల్ మధ్య ముద్దు సన్నివేశం ఉంది.

ట్రైలర్ లో ఒక్క క్షణం కంటే తక్కువగానే ఈ సీన్ చూపించారు. దీంతో ఇప్పుడు అదే సీన్ పై సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. తనకంటే చాలా చిన్న వయసు ఉన్న నటితో 70 ఏళ్ల కమల్ హాసన్ ముద్దు సన్నివేశం పై చేయడంపై నెటిజన్స్ విమర్శలు చేశారు. ఇప్పటికే ఈ ఇష్యూపై డైరెక్టర్ మణిరత్నం స్పందించారు. ఇక ఇప్పుడు నటి అభిరామి సైతం రియాక్ట్ అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. “ఈరోజుల్లో ప్రతిదీ వివాదమే అవుతుంది. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోలేం. కమల్ కు నాకు మధ్య ఆ ముద్దు సీన్ కేవలం మూడు సెకన్లు మాత్రమే ఉంది. ఇక ట్రైలర్ లో ఒక్క సెకను కూడా చూపించలేదు. ట్రైలర్ లో అది కేవలం ముద్దు సన్నివేశంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ సీన్ కు కారణం ఏంటీ.. ? దానికి నేపథ్యం ఏంటో సినిమా చూసిన తర్వాతే తెలుసుస్తుంది. ఆ సీన్ దేని గురించి అనేది సినిమా చూసినవారికి తెలుసుతుంది. సినిమా చూసిన వారికి ఆ సన్నివేశం ఖచ్చితంగా అవసరమని నేను అనుకుంటున్నాను. నేను మణి సర్ లాజిక్ తో ఏకీభవిస్తాను. అనవసరంగా ఈ సీన్ పై రాద్ధంతం చేస్తున్నారు. సినిమాకు కలిసొచ్చేదే మార్కెటింగ్ టీమ్ చేస్తుందని నాకు తెలుసు. అయితే ఎలాంటి నిర్ణయానికి వచ్చే ముందు సినిమా చూడండి అని నేను కోరుతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

అభిరామి.. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో వేణు నటించిన చెప్పవే చిరుగాలి సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తుంది. అభిరామి, కమల్ మధ్య ముద్దు సన్నివేశాలు రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో కమల్ నటించి, దర్శకత్వం వహించిన ‘విరుమండి’ సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..