నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే వారు మన దగ్గర కోకొల్లలు. అలాగే తమ అభినయంతో ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్న వారు ఉన్నారు. వారందరిలో ఈ నటి చాలా ప్రత్యేకం.. తన కళ్ళతోనే ఎమోషన్స్ పలికించగలదు. ఆమె నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.. ఆమె మరెవరో కాదు అభినయ.

నా కూతురికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బ్రతిమిలాడా..! మూగ అమ్మాయి సినిమాల్లోకా అని అవమానించారు
Abhinaya

Updated on: Jan 27, 2026 | 11:32 AM

హీరోయిన్ అంటే అందం మాత్రమే కాదు.. అభినయం, నటన. ఎంతో మంది హీరోయిన్స్ దానిని రుజువు చేశారు కూడా. సినిమా ఇండస్ట్రీ అంటేనే పోటీ.. కొత్త హీరోయిన్స్ ఎప్పుడూ వస్తుంటారు. ఈ పోటీప్రపంచంలో రాణించాలంటే ఎంతో కష్టపడాలి.. కానీ ఓ నటి అందరి కంటే ప్రత్యేకం.. ఇండియాలోనే కాదు ప్రపంచంలో అలాంటి నటి లేరనే చెప్పాల్సి. చెవులు వినిపించకపోయినా.. మాటలు రాకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి అభినయ. తమిళనాడుకు చెందిన అభినయ రవితేజ నేనింతే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాలో చిన్న రోల్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

అయితే అదే రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో బాగా ఫేమస్ అయ్యిందీ అందాల తార. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ ల సోదరిగ నటించి అందరి మన్ననలు అందుకుంది. వీటితో పాటు కింగ్, దమ్ము, ధ్రువ, సీతా రామం, గామీ తదితర తెలుగు సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైంది. వీటితో పాటు మార్క్ ఆంటోనీ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. ఇటీవలే ఆమె పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు అభినయ. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలులో అభినయ, తన తండ్రితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అభినయ తండ్రి పేరు ఆనంద్.. ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో అభినయ గురించి ఆమె తండ్రి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు. పుట్టినప్పుడు నా దగ్గరకు తీసుకురాగానే అభినయ అనే పేరు పెట్టేశా.. అంత అందంగాఉంది . పెద్ద ఆర్టిస్ట్ ను చేయాలని తపన ఉండేది.. మధ్యలో కొన్నిసమస్యలు వచ్చాయి. వాటన్నింటిని దాటుకొని ఈ స్థాయికి వచ్చింది అన్నారు. ఒకేసారి నాతో షూటింగ్ కు వచ్చింది అప్పటి నుంచి తాను కూడా ఆర్టిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ కలిగింది. ఇంత అందంగా ఉంది కానీ మాటలు రావు, చెవులు వినిపించవు కదా మోడల్ ని చేద్దాం అనుకున్నా.. కానీ నటి అయ్యింది అని ఆమె తండ్రి అన్నారు. ఇక నటనలో 15 అవార్డ్స్ అందుకుంది. అభినయ ఫోటోలు పట్టుకొని ఎన్నో సినిమా కంపెనీలకు తిరిగాను.. ఎంతో మందిని కలిశాను.. ఒక్క అవకాశం ఇవ్వండి అని తిరిగా.. చాలా మంది నా పై కోప్పడ్డారు. ఒక మూగ అమ్మాయిని తీసుకొచ్చి సినిమాల్లో ట్రై చేస్తున్నాడే పిచ్చోడా.. రకరకాల మాటలు మాట్లాడారు. కానీ నేను అవేం పట్టించుకోలేదు. చివరకు సముద్ర ఖనిగారు అవకాశం ఇచ్చారు అని అభినయ తండ్రి ఆనంద్ ఎమోషనల్ అయ్యారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..