Suriya- Jyothika: మా ఆయనకు ఒక చెడ్డ అలవాటుంది.. హీరో సూర్య గురించి షాకింగ్ విషయం బయట పెట్టిన జ్యోతిక

ఓ వైపు హీరో సూర్య పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటుంటే.. మరో వైపు జ్యోతిక లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ అందాల తార తన భర్త, హీరో సూర్య గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది.

Suriya- Jyothika: మా ఆయనకు ఒక చెడ్డ అలవాటుంది.. హీరో సూర్య గురించి షాకింగ్ విషయం బయట పెట్టిన జ్యోతిక
Suriya, Jyothika

Updated on: Jan 28, 2026 | 9:23 PM

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో సూర్య, జ్యోతిక జోడీ జోడీ కూడా ఒకరు. పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుమారు 20 ఏళ్లుగా అన్యోన్యంగా ఉంటూ నేటి యూత్ కు రిలేషన్ షిప్ పాఠాలు నేర్పిస్తున్నారు. ఆ మధ్యన ఈ దంపతుల గురించి విడాకుల వార్తలు వచ్చినా అవి రూమర్లేనని తేలిపోయాయి. సూర్య – జ్యోతిక దంపతులకు దియా అనే కూతురు, దేవ్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఆలనా పాలనా చూసుకుంటూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది జ్యోతిక. అయితే చేతికొచ్చిన సినిమాలన్నీ కాకుండా స్టోరీ బేస్డ్ మూవీస్ నే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక సూర్య పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ముంబైలోనే కాపురముంటోన్న సూర్య, జ్యోతిక ఇటీవల తమ 19వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు మ్యారేజ్ యానివర్సీరీ విషెస్ తెలిపారు.ఈ నేపథ్యంలో సూర్య గురించి జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే..

‘నా భర్త సూర్య నాతో స్నేహంగా ఉంటారు. ప్రేమగా చూసుకుంటారు. నాకు చాలా గౌరవం కూడా ఇస్తారు. అది నాకు చాలా ఇష్టం. కానీ మా ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది. అది మాత్రం నాకు అసలు నచ్చదు. ఆయన బాత్రూంలో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ అలవాటును మాత్రం నేను సహించలేను. దీనికోసం మేం తరచూ గొడవలు కూడా పడతాం’ అని జ్యోతిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

హీరో సూర్యతో జ్యోతిక..

సినిమాల విషయానికి వస్తే.. చివరిగా కంగువా సినిమాలో కనిపించాడు సూర్య. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సూర్య. ఇందులో మమితా బిజు హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కురుప్పు అనే మూవీ చేస్తున్నాడు సూర్య. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి