Actor Yash: రాఖీ భాయ్ గ్యారేజ్‌లోకి కొత్త లగ్జరీ కారు.. ధర ఎన్ని కోట్లో తెలుసా? నంబర్ ప్లేట్ కూడా స్పెషలే

పాన్ ఇండియా స్టార్ యష్ వద్ద ఇప్పటికే అనేక రకాల లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు అతని గ్యారేజ్ లోకి మరో కొత్త కారు వచ్చింది. యష్ కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఈ లగ్జరీ కారు కొన్నాడని తెలుస్తోంది. కారుతో పాటు దీని రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Actor Yash: రాఖీ భాయ్ గ్యారేజ్‌లోకి కొత్త లగ్జరీ కారు.. ధర ఎన్ని కోట్లో తెలుసా? నంబర్ ప్లేట్ కూడా స్పెషలే
Actor Yash

Updated on: Jul 02, 2025 | 8:25 AM

ప్రస్తుతం  భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో  కన్నడ స్టార్ యశ్ కూడా ఒకరు. దీనికి తగ్గట్టుగానే హీరో లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. రాఖీ భాయ్ కు విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు అతను కొత్త కారు కొన్నాడు. ఈ కారు మాత్రమే కాదు, దాని నంబర్ ప్లేట్ కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యశ్ తన సినిమా షూటింగ్ ల కోసం ముంబైలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. క్రమంలోనే తన ప్రయాణానికి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. యశ్ లెక్సస్ LM 350H 4S అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇది ప్రస్తుతం రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల దగ్గర మాత్రమే. ఈ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. అలాగే వాహనదారులకు అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఇక దీని ధర కూడా చాలా ఎక్కువే.

ఇవి కూడా చదవండి

యష్ కొనుగోలు చేసిన లెక్సస్ LM 350H 4S అల్ట్రా లగ్జరీ కారు ధర దాదాపు 3 కోట్లు (ఆన్ రోడ్). ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర 2.65 కోట్లు. యష్ నీలిరంగు కారును కొనుగోలు చేసి ఏప్రిల్ నెలలో రిజిస్టర్ చేశాడు. ప్రత్యేకత ఏమిటంటే నటుడు యష్ ఈ కారును మహారాష్ట్రలో రిజిస్టర్ చేశాడు. ఈ కారుతో పాటు రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఆకర్షణీయంగా ఉంది. యష్ కొన్న కారు నంబర్ MH47CB8055. 8055 నంబర్‌ను ‘బాస్’ నంబర్ అంటారు. 8055 నంబర్ ఇంగ్లిలీ BOSS లాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నంబర్‌ను బాస్ నంబర్ అని పిలుస్తారు. అంతే కాదు, 8055 నంబర్ కూడా చాలా ఖరీదైనది. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షల రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే. కాగా యశ్ ఇప్పుడు కొనుగోలు చేసిన లెక్సస్ కారు అతని నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్స్ పేరు మీద రిజిస్టర్ చేశారు.

యష్ కొనుగోలు చేసిన లెక్సస్ LM350H4S అల్ట్రా ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సౌకర్యవంతమైన కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, విద్యుత్తుతో నడిచే హైబ్రిడ్ కారు. ఈ కారులో విలాసవంతమైన హీటెడ్-వెంటిలేటెడ్ రిక్లైన్ రకం సీట్లు, మసాజర్లు, ప్రతి సీటుకు ప్రత్యేక స్క్రీన్లు, మినీ ఫ్రిజ్, ఆటోమేటెడ్ డోర్ సిస్టమ్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు, ఈ కారులో అత్యుత్తమ భద్రతా వ్యవస్థ కూడా ఉంది.

కొత్త కారుతో హీరో యశ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.