
కన్నడ స్టార్ హీరో యష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యష్. యష్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తారు. ఆయనతో సెల్ఫీ కోసం అభిమానులు తహతహలాడుతున్నాడు. ఇటీవలే యశ్ పుట్టినరోజున జరిగిన ఘటన చేదు జ్ఞాపకంగా మిగింది. కాగా తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. నటుడు యశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఓ అభిమానికి గాయాలయ్యాయి. బళ్లారి శివార్లలోని బాలాజీ క్యాంపులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బళ్లారిలోని అమృతేశ్వర స్ఫటిక లింగ ఆలయాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టార్ హీరో యష్ ఇక్కడికి వచ్చారు. యష్ రాక వార్త విన్న అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
యష్ కారు కనిపించగానే చాలా మంది అభిమానులు ఆయన కారును వెంబడించారు. ఈ సమయంలో బళ్లారి జిల్లా సిరగుప్ప పట్టణానికి చెందిన వసంత్ అనే యువకుడి కాలుపై నుంచి యష్ కాన్వాయ్ వాహనం దూసుకెళ్లింది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మొన్నీమధ్యనే యష్ పుట్టినరోజు అభిమానులకు ప్రమాదం జరిగింది. జనవరి 7వ తేదీన గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్ తాలూకా సురంగి గ్రామంలో యశ్ కటౌట్‌ను ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ వైరుకు ఇనుప రాడ్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందారు. కొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న యష్ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటన మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
ఇలా వరుసగా అభిమానులు గాయపడటంతో యష్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎవ్వరు ప్రాణాలమీదకు తెచ్చుకోకండి అని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి మలయాళానికి చెందిన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.