AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: రామాయణం ‘రావణ తాండవం’ సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన యశ్‌.. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో యశ్ బాగానే డ్యాన్స్ చేశాడు. కానీ 'KGF' తర్వాత ఈ రాకింగ్ స్టార్ వెండితెరపై డ్యాన్స్ చేసిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత యశ్ మళ్లీ స్టెప్పులేశాడు. ఇప్పుడీ సాంగ్ యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

Ramayana: రామాయణం 'రావణ తాండవం' సాంగ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన యశ్‌.. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్
Ravana Tandav Song From Ramayana Movie
Basha Shek
|

Updated on: Oct 21, 2026 | 2:18 PM

Share

మరో 15 రోజుల్లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘రామాయణ’ సినిమా రిలీజ్ కాబోతుంది. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ తెరకెక్కించిన ఈ సినిమలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి.. రాముడు, సీత పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ యష్.. రావణుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా మూవీ నుంచి టీజర్, ట్రైలర్, ఒకటి రెండు పాటలు వదిలారు. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని ‘రావణ తాండవం’ పేరిట గూస్ బంప్స్ తెప్పించే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే.. యష్ ఒక అద్భుతమైన నటుడు, అందులో సందేహం లేదు. అతను మంచి డ్యాన్సర్ కూడా. ‘KGF’కి ముందు, యష్ నటించిన చాలా సినిమాల్లో రాకింగ్ స్టార్ సూపర్బ్ స్టెప్పులేశాడు. ‘డ్రామా’, ‘కిరాతక’, ‘గూగ్లీ’, ‘సంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్’ వంటి మరెన్నో సినిమాల్లో యష్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. కానీ ‘KGF’ తర్వాత యష్ తెరపై మళ్లీ డ్యాన్స్ చేయలేదు. ఇప్పుడు, సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత, యష్ మళ్లీ డ్యాన్స్ చేశాడు. రావణతాండవం పాటకు గానూ డ్యాన్స్ అదరగొట్టేశాడు యష్. ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. ఏఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ గీతాన్ని తెలుగులో దేవిశ్రీ ప్రసాద్, తమిళంలో అనిరుధ్-జీవీ ప్రకాశ్ కుమార్, కన్నడలో రవి బస్రూర్, హిందీలో విశాల్ దద్లానీ పాడారు. వీళ్లంతా ఆయా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడం విశేషం.

సుమారు 1.55 నిమిషాల పాటు సాగిన రావణతాండవం సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ సాంగ్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ సాంగ్ ను చూసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. కాగా ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాల్లో ‘రామాయణం’ కూడా ఒకటి. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్, సీతగా సాయి పల్లవి నటించారు. సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ తదితర స్టార్ నటీనటులు కూడా ఈ చిత్రంలో వివిధ పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, ‘డీఎన్ఈజీ’ , యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంయుక్తంగా రామాయణ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

రావణతాండవం సాంగ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us