Vishal: ఆ టాలీవుడ్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి! ముహూర్తం కూడా ఫిక్స్! ‘మాకు నమ్మకం లేదు దొర’ అంటోన్న నెటిజన్లు

కోలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న ఓ క్రేజీ హీరోయిన్ తో అతను మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

Vishal: ఆ టాలీవుడ్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి! ముహూర్తం కూడా ఫిక్స్! మాకు నమ్మకం లేదు దొర అంటోన్న నెటిజన్లు
Vishal

Updated on: May 19, 2025 | 5:35 PM

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ పెళ్లిపై మళ్లీ రూమర్లు గుప్పమంటున్నాయి. త్వరలోనే ప్రముఖ హీరోయిన్‌ తో కలిసి అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెద్దలు కూడా అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరు తమ పెళ్లిపై అధికారిక ప్రకటన వినిపిస్తారని పలు స్థానిక, ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆ మధ్యన నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించాడు. అందుకు తగ్గట్టుగానే ఇటీవలే నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విశాల్ తన పెళ్లి గురించి మాట్లాడాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానన్నాడు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని అభిమానులతో చెప్పాడు. ఈ క్రమంలో విశాల్ పెళ్లి వార్తలు మరోసారి గుప్పమంటున్నాయి. అన్నట్లు ప్రచారంలో ఉన్నట్లు విశాల్ తో ప్రేమలో ఉన్న హీరోయిన్ మరోవరో కాదు కబాలి నటి సాయి ధన్సిక. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని విశాల్ సన్నిహితులు కూడా చెబుతున్నారు. ఈ రూమర్లకు బలం చేకూరేలా సోమవారం (మే19) సాయంత్రం సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడు. ఈ ఈవెంట్‌లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి. అంటే మరికొన్ని గంటల్లో దీనిపై ఓ క్లారిటీ రానుందన్నమాట.

కాగా సాయి ధన్సిక కబాలి సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అందులో రజనీకాంత్ కూతురిగా అద్బుతంగా నటించింది. ఆ తర్వాత తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిందీ అందాల తార. ప్రస్తుతం కోలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తోంది సాయి ధన్సిక.

ఇవి కూడా చదవండి

సాయి ధన్సిక లేటెస్ట్ ఫొటోస్..

విశాల్‌ పెళ్లి గురించి ఇలాంటి వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ అతని వివాహంపై ఎన్నో వార్తలు వచ్చాయి. వరలక్ష్మి, అభినయ, లక్ష్మీ మేనన్ వంటి పలువురు హీరోయిన్స్ ను అతను పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. మరి ఈ రూమరైనా నిజం అవుతుందో, లేదో చూడాలి.

సినిమా ఈవెంట్ లో సాయి ధన్సిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.